ఏపీ సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు తన రాజీనామా లేఖను పంపించారు. చంద్రబాబు రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు చేసే వరకు సీఎంగా కొనసాగాలని చంద్రబాబుకు గవర్నర్ నిర్దేశించారు. ఇవాళ వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ 150స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..టీడీపీ కేవలం 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవడంతో చంద్రబాబు తన పదవికి రాజీనామా చేశారు.
రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. విజయం సాధించిన జగన్మోహన్‌రెడ్డికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీకి, నవీన్‌పట్నాయక్‌కు కూడా విషెస్ చెప్పారు. టీడీపీని గెలిపించడం కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన శ్రేయోభిలాషులకు అభినందనలు చెప్పారు. ఫలితాలపై సమీక్షించుకుంటామని, భవిష్యత్ కార్యాచరణను త్వరలో నిర్ణయిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.