టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేత కింజరపు అచ్చన్నాయుడుని పరామర్శించారు. ఆయన ఆరోగ్య, యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దంటూ ధైర్యం చెప్పారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఇటీవలే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. దీంతో అచ్చెన్న ఫ్యామిలీ తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఈ ఉదయం కుటుంబ సమేతంగా మొక్కు తీర్చుకుని విజయవాడ చేరుకుంది. విజయవాడ వచ్చిన అచ్చెన్నాయుడిని ఈ సాయంత్రం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పరామర్శించారు. కరెన్సీ నగర్ లో ఉన్న అచ్చెన్న నివాసానికి తరలి వెళ్లిన చంద్రబాబు.. అచ్చెన్నకు నిబ్బరంగా ఉండాలని సూచించారు. బాబు వెంట అచ్చెన్న దగ్గరకు వెళ్లిన వారిలో ఎంపీ కేశినేని నాని, ఇతర నేతలు ఉన్నారు.