చంద్రబాబుకు విదేశాల్లో ఆస్తులు.. బాంబు పేల్చిన విజయసాయి

|

Apr 18, 2020 | 1:02 PM

ఏపీలో ఒకవైపు కరోనాపై సమరం కొనసాగుతుండగానే పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం రోజు ఓ తంతుగా కొనసాగుతోంది. ఈక్రమంలోనే మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి.

చంద్రబాబుకు విదేశాల్లో ఆస్తులు.. బాంబు పేల్చిన విజయసాయి
Follow us on

ఏపీలో ఒకవైపు కరోనాపై సమరం కొనసాగుతుండగానే పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం రోజు ఓ తంతుగా కొనసాగుతోంది. ఈక్రమంలోనే మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి. విశాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించిన విజయసాయిరెడ్డి శనివారం చంద్రబాబుపై రెచ్చిపోయారు.

జీవీఎంసీ ఎంప్లాయిస్‌కు గ్రామ వాలంటీర్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన విజయసాయిరెడ్డి, మంత్రులు మోపిదేవి వెంకట రమణ, అవంతి శ్రీనివాసరావు ఆ తర్వాత టీడీపీ నేతల ఆరోపణలపై స్పందించారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి అయితే చంద్రబాబును ఓ ఆటాడుకున్నారు. ‘‘చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారు.. ఆయన ఏపీ ప్రతిపక్ష నాయకుడా ? లేక తెలంగాణాలో విపక్ష నాయకుడా?… ఈ సమయంలో కూడా రాజకీయాలు చేయడం దురదృష్టకరం.. విశాఖలో కరోనా కేసులు దాయవలసిన అవసరం ఏముంది? కేసులపై రేపు (ఆదివారం ఏప్రిల్ 19) పూర్తి వివరాలు అందచేస్తాము.. చంద్రబాబు రాష్ట్ర ఖజనా ఖాళీ చేసి విదేశాల్లో ఆస్తులు దాచుకున్నాడు.. చంద్రబాబు ఇంట్లో నుండి బయటకు వచ్చి మాట్లాడాలి.. ’’ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు విజయసాయిరెడ్డి.

హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడే బదులు ముందు ఆయన ఏపీకి రావాలన్నారు విజయసాయిరెడ్డి. లాక్ డౌన్ పీరియడ్‌లో బయటికి రాకపోవడం వల్ల టీడీపీ నేతలకు కొవ్వు బాగా పెరిగిందని, అందుకే దీక్షలు చేస్తున్నారని అన్న విజయసాయిరెడ్డి, దీక్షల వల్ల వారి ఒంటిలో పెరిగిపోయిన కొవ్వు కాస్తైనా తగ్గుతుందని ఆయన ఎద్దేవా చేశారు.