టీడీఎల్పీ నేతగా చంద్రబాబు..!

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి టీడీఎల్పీ భేటీ అయ్యింది. చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ జరిగిన ఈ భేటీలో టీడీపీఎల్పీ నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా.. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ఏంటనేది ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. చంద్రబాబు నాయకత్వంపై కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేలంతా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సుజనాచౌదరి, […]

టీడీఎల్పీ నేతగా చంద్రబాబు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 29, 2019 | 1:28 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి టీడీఎల్పీ భేటీ అయ్యింది. చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ జరిగిన ఈ భేటీలో టీడీపీఎల్పీ నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా.. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ఏంటనేది ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. చంద్రబాబు నాయకత్వంపై కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేలంతా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

బుధవారం జరిగిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు సుజనాచౌదరి, కనకమేడల రవీంద్ర కుమార్, చినరాజప్ప, కళా వెంకట్రావ్, యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. అటు పార్టీ భవిష్యత్తు, కార్యాచరణ, త్వరలో జరిగే శాసనసభా సమావేశాల్లో పాటించాల్సిన వైఖరి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధత మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.