ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు ఆయువుపట్టు..!

|

Oct 12, 2020 | 9:30 AM

అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఉండాలంటూ భూములిచ్చిన ఆప్రాంత రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు నేటికి 300 రోజులకు చేరాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు వరుస ట్వీట్లు చేశారు. “రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ప్రజలు చేస్తోన్న ఉద్యమానికి 300 రోజులు. ఉద్యమంలో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారు. అయినా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గుర్తించడంలేదు. అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు ఆయువుపట్టు. అటువంటి […]

ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు ఆయువుపట్టు..!
Follow us on

అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఉండాలంటూ భూములిచ్చిన ఆప్రాంత రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు నేటికి 300 రోజులకు చేరాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు వరుస ట్వీట్లు చేశారు. “రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ప్రజలు చేస్తోన్న ఉద్యమానికి 300 రోజులు. ఉద్యమంలో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారు. అయినా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గుర్తించడంలేదు. అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు ఆయువుపట్టు. అటువంటి రాజధానిని కాపాడుకోవడం రాష్ట్రప్రజలుగా మనందరి బాధ్యత. అంతేకాదు రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు చేస్తోన్న నమ్మకద్రోహాన్ని ప్రశ్నించకపొతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం. అందుకే రాష్ట్రమంతా ఒక్కటిగా నిలిచి అమరావతి కోసం పోరాడుదాం. ఇది చారిత్రాత్మక అవసరం” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.