సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం..: చంద్రబాబు

| Edited By:

May 07, 2019 | 1:00 PM

విపక్షాలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వీవీప్యాట్లను లెక్కించాల్సిందేనన్న విపక్షాల పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. టీడీపీ సహా 21 విపక్ష పార్టీల వాదనను కూడా వినేందుకు నిరాకరించింది. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. నియోజక వర్గంలో 5 శాతం వీవీప్యాట్ల స్లిప్పుల్ని లెక్కించాలని ఇదివరకే ఈసీని సుప్రీం ఆదేశించింది. కాగా.. ఈ తీర్పుపై స్పందించిన చంద్రబాబు.. కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. సమయం పట్టినా పారదర్శకత ముఖ్యమని, త్వరలోనే ఈసీని […]

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం..: చంద్రబాబు
Follow us on

విపక్షాలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వీవీప్యాట్లను లెక్కించాల్సిందేనన్న విపక్షాల పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. టీడీపీ సహా 21 విపక్ష పార్టీల వాదనను కూడా వినేందుకు నిరాకరించింది. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. నియోజక వర్గంలో 5 శాతం వీవీప్యాట్ల స్లిప్పుల్ని లెక్కించాలని ఇదివరకే ఈసీని సుప్రీం ఆదేశించింది.

కాగా.. ఈ తీర్పుపై స్పందించిన చంద్రబాబు.. కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. సమయం పట్టినా పారదర్శకత ముఖ్యమని, త్వరలోనే ఈసీని కలుస్తామని ఆయన చెప్పారు.