జగన్ రెచ్చగొట్టారు..మంత్రులు బెదిరించారు.. అందుకే కియా!

|

Feb 06, 2020 | 5:23 PM

ఏపీ నుంచి కియా కార్ల కంపెనీ తరలిపోవడం ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గతంలో భూములిస్తున్న రైతులను జగన్ బెదిరించారని, అధికారం చేపట్టిన తర్వాత కియా వల్ల 20వేల కోట్ల భారమంటూ ప్రకటనలు చేశారని అందుకే కియా కార్ల కంపెనీ తమిళనాడు బాట పట్టి వుంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కియా పరిశ్రమ యాజమాన్యం తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు రాయిటర్స్ కథనం ఇచ్చిందని, దాన్ని తమిళనాడు అధికారులు ధ్రువీకరించారని చంద్రబాబు అంటున్నారు. కియా తరలించాలనుకోవడం దారుణమని చంద్రబాబు […]

జగన్ రెచ్చగొట్టారు..మంత్రులు బెదిరించారు.. అందుకే కియా!
Follow us on

ఏపీ నుంచి కియా కార్ల కంపెనీ తరలిపోవడం ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. గతంలో భూములిస్తున్న రైతులను జగన్ బెదిరించారని, అధికారం చేపట్టిన తర్వాత కియా వల్ల 20వేల కోట్ల భారమంటూ ప్రకటనలు చేశారని అందుకే కియా కార్ల కంపెనీ తమిళనాడు బాట పట్టి వుంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కియా పరిశ్రమ యాజమాన్యం తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు రాయిటర్స్ కథనం ఇచ్చిందని, దాన్ని తమిళనాడు అధికారులు ధ్రువీకరించారని చంద్రబాబు అంటున్నారు.

కియా తరలించాలనుకోవడం దారుణమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ పరిశ్రమతో వేలమందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారాయన. కియా కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడగా.. తాము శ్రమించి వారిని ఏపీకి రప్పించామని అన్నారు చంద్రబాబు. గతంలో ఏపీకి వోక్స్ వ్యాగన్ పరిశ్రమ వస్తే మంత్రి బొత్స సత్యనారాయణ అవినీతి తో వెళ్ళిపోయిందని, ఆ కేసు ఇప్పటికీ ఆయనపై కొనసాగుతోందని చంద్రబాబు వివరించారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు ప్రారంభం అయ్యాయని, కియాతో 20 వేల కోట్ల రూపాయలు భారమన్న మంత్రులు ఒప్పందాన్ని సమీక్షిస్తామని ప్రకటించారని చంద్రబాబు గుర్తు చేశారు. గతంలో విపక్ష నేతగా జగన్ అనంతపురం వెళ్లి రైతులను రెచ్చగొట్టాడని, భూములు ఇవ్వవద్దని భయపెట్టారని చంద్రబాబు ఆరోపించారు. కియా కంపెనీ సీఈఓను ఓ వైసీపీ ఎంపి బెదిరించారని ఆరోపించిన చంద్రబాబు తాము చెప్పినట్లు వినాలని, తమ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని వైసీపీ నేతలు కియా ప్రతినిధులను బెదిరించారని చంద్రబాబు అంటున్నారు.

వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక పక్క రాష్ట్రాలకు వెళ్ళాలని కియా డిసైడ్ అయ్యిందని అంటున్న చంద్రబాబు 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతోనే ఇబ్బందులు తలెత్తాయని చెబుతున్నారు. కియా యాజమాన్యాన్ని బెదిరించింది వాస్తవం కాదా అని చంద్రబాబు మంత్రి బుగ్గనను ప్రశ్నించారు.