కరోనా భయం.. రాష్ట్రాలకు కేంద్రం ‘అభయం’

| Edited By: Pardhasaradhi Peri

Jun 14, 2020 | 12:59 PM

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం 'అభయమిచ్చింది. ఈ కేసులను క్లినికల్ దశలో.. ముఖ్యంగా విషమ స్థితిలో ఉన్న రోగుల తాలూకు కేసులను మేనేజ్ చేయడానికి...

కరోనా భయం.. రాష్ట్రాలకు కేంద్రం అభయం
Follow us on

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ‘అభయమిచ్చింది. ఈ కేసులను క్లినికల్ దశలో.. ముఖ్యంగా విషమ స్థితిలో ఉన్న రోగుల తాలూకు కేసులను మేనేజ్ చేయడానికి ఓ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీ లోని ఎయిమ్స్ లో..ఏర్పాటు చేసిన ఈ గ్రూప్.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు క్లినికల్ సలహాలను, సూచనలను ఇస్తుంది. ప్రతి రాష్ట్రం నుంచి నోడల్ అధికారి లేదా డాక్టర్ తో అనుసంధానం చేస్తూ.. వాట్సాప్ గ్రూప్ ని కూడా నిర్దేశించింది. ఇక అన్ని రాష్ట్రాలు ఈ విధమైన  నిపుణుల బృందాలను నియమించుకోవాలని, ముఖ్యంగా ఐసీయూలలో ఉన్న విషమ కేసులను మేనేజ్ చేసి మరణాల సంఖ్యను తగ్గించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్.. కోరుతూ ఆయా రాష్ట్రాలకు లేఖలు రాశారు.

కాగా-గత 24 గంటల్లో దేశంలో 11,458  కరోనా కేసులు నమోదు కాగా..386 మంది రోగులు మరణించారు. ముఖ్యంగా ఢిల్లీలో ఎక్కువగా-129 మంది మృత్యుబాట పట్టారు. మహారాష్ట్రలో 127, గుజరాత్ లో 30, యూపీలో 20, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో తొమ్మిది మంది చొప్పున మృతి చెందారు. నిన్నటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది.