Farmers Protest Live Updates: నేడు విజ్ఞాన్ భవన్‌లో కేంద్రం-రైతుల మధ్య జరిగిన 8వ విడత చర్చలు కూడా అసంతృప్తిగానే ముగిశాయి. అటు రైతులు చట్టాలు రద్దు చేయాలని పట్టుబడుతుంటే.. రద్దు తప్ప మరే ప్రతిపాదనకు అయినా కూడా తాము సిద్దమేనని కేంద్రం తమ వైఖరిపై కట్టుబడి ఉంది. కొత్త వ్యవసాయ చట్టాలను రైతులు అర్ధం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇక రైతు సంఘాలు, కేంద్రం పట్టువీడకపోవడంతో.. ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. జనవరి 15వ తేదీన మరోసారి చర్చలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, కేంద్రం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. విజ్ఞాన్ భవన్ వద్ద కర్షకులు ‘మరణమో లేదా విజయమో’, ‘చట్టాలు రద్దయితేనే ఇంటికి’ నినాదాలతోప్లకార్డులను ప్రదర్శించారు.
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని.. సవరణలకు అంగీకరించేది లేదని రైతులు తేల్చి చెప్పారు. తమ డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతోన్న ఎనిమిదో విడత చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చర్చనీయాంశంగా మారింది.
నేడు విజ్ఞాన్ భవన్‌లో కేంద్రం-రైతుల మధ్య జరిగిన 8వ విడత చర్చలు అసంతృప్తిగానే ముగిశాయి. అటు రైతులు చట్టాలు రద్దు చేయాలని పట్టుబడుతుంటే.. రద్దు తప్ప మరే ప్రతిపాదన అయినా కూడా తాము సిద్దమేనని కేంద్రం తమ వైఖరిపై కట్టుబడి ఉంది. దీనితో సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. జనవరి 15వ తేదీన మరోసారి చర్చలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కేంద్రం, రైతుల మధ్య ఎనిమిదో విడత చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ దఫా సమావేశాల్లో కూడా పరిష్కారం దొరికేలా కనిపించట్లేదు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వీలు లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయాన్నే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతు సంఘాలకు మరోసారి స్పష్టం చేశారు.
అయితే దీనికి రైతులు ఒప్పుకోవట్లేదు. వ్యవసాయ రంగం రాష్ట్రాల పరిధిలోని అంశమని, ఇందులో కేంద్రానికి చట్టాలు చేసే అధికారం లేదని.. వెంటనే సాగు చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘం నేత బల్బీర్ సింగ్ రజేవాల్ కేంద్రమంత్రితో అన్నారు. ‘మరణమో లేదా విజయమో’, ‘చట్టారు రద్దయితేనే ఇంటికి’ అంటూ రైతులు నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.
విజ్ఞాన్ భవన్‌లో కేంద్రం, రైతుల మధ్య ఎనిమిదో రౌండ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఈసారైనా సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావంతో బయట రైతు సంఘాల నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
కొత్త వ్యవసాయ సాగు చట్టాలను రద్దుకు కేంద్రం ససేమిరా అంటోంది. అది తప్ప మరే ప్రతిపాదనను అయినా కూడా తాము పరిశీలిస్తామని హామీ ఇస్తోంది. కొత్త చట్టాలను రైతులు అర్ధం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రైతులకు, కేంద్రానికి మధ్య ఎనిమిదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే కీలాకాంశాలను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
అకాల వర్షాలను, కటిక చలిని, నిద్రహరాలను.. దేన్నీ కూడా కర్షకులు లెక్క చెయ్యట్లేదు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేసేవరకు తమ పోరు ఆగదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఇవాళ విజ్ఞాన్ భవన్‌లో కేంద్రం, రైతుల మధ్య మరోసారి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో 41 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఒకవైపు కేంద్రం.. మరోవైపు కర్షకులు.. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంటే.. రైతులు కూడా రద్దు చేసేవరకు వెనక్కి తగ్గేది లేదని పట్టు విడవట్లేదు. దీనితో ఇప్పటిదాకా కేంద్రం, రైతుల మధ్య ఏడు విడతల చర్చలు సాగినా కూడా సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఢిల్లీ సరిహద్దుల్లో కర్షకుల ఆందోళనలు 44వ రోజుకు చేరుకున్నాయి.
కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్, సోం ప్రకాష్‌లు రైతు సంఘాల నేతలతో చర్చలు ప్రారంభించారు.
#UPDATE: The eighth round of talks between Central Government and farmer leaders, begin at Vigyan Bhawan in Delhi.#FarmLaws https://t.co/n2EBWvk4mX
— ANI (@ANI) January 8, 2021
రైతులతో ఎనిమిదో విడత చర్చల నిమిత్తం కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, సోం ప్రకాష్ విజ్ఞాన్ భవన్‌కు చేరుకున్నారు.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రైతులకు, కేంద్రానికి మధ్య ఎనిమిదో విడత చర్చలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రైతు నాయకులందరూ కూడా విజ్ఞాన్ భవన్‌కు చేరుకున్నారు.
दिल्ली: विज्ञान भवन में बैठक के लिए जाने से पहले किसान नेता। आज किसानों और केंद्र सरकार के बीच आठवें दौर की वार्ता होनी है। #FarmersProtest https://t.co/QTTWl0Uoug pic.twitter.com/kbCQf9Km0o
— ANI_HindiNews (@AHindinews) January 8, 2021
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానీ జంతర్ మంతర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు శుక్రవారం.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని వారి నివాసంలో కలుసుకున్నారు.
రైతుల ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టడమే లక్ష్యంగా జరగనున్న 8వ దఫా చర్చల్లో పాల్గొనేందుకు గాను రైతులు కాసేపటి క్రితమే విజ్ఞాన్ భవన్ చేరుకున్నారు. అయితే చట్టాల సవరణలకు అంగీకరించే ప్రసక్తే లేదని, రద్దు చేయడం మాత్రమే పరిష్కారమని రైతు సంఘాల వాదిస్తున్నారు. కనీస మద్దతు ధర విషయంలో కమిటీలు వేస్తే ఒప్పుకోమని.. చట్టం తేవాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతులతో మరోసారి చర్చలు జరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ దఫా చర్చల్లో సానుకూల ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని ప్రభుత్వం తరఫున చర్చలకు హాజరవుతున్న వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వంతో మరోసారి చర్చలకు వెళుతోన్న సమయంలో భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికైట్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దఫా జరగనున్న చర్చల్లోనైనా సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో ఉన్నాం అని చెప్పుకొచ్చారు.
ఇక మరికొద్ది గంటల్లో రైతులతో చర్చకు వెళతారన్న సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తమ్ రూపాలా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీలో సమస్య ఓ కొలిక్కి వస్తుందని అభిప్రాయపడ్డారు. తొలి భేటీలోనే రైతులు తమ సమస్యలను స్పష్టంగా చెప్పి, చర్చించి ఉంటే ఈ పాటికే సమస్య తొలిగిపోయేదని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే కొత్త చట్టాల్లో సవరణలకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి. కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. మరి రైతుల ఆందోళనలకు ఈ దఫ చర్చలతోనైనా ముగింపు పడుతుందో లేదో మరికొంత సమయంలో తెలిసిపోనుంది.
ఇక రైతు సంఘాలతో జరగబోయే చర్చల నేపథ్యంలో సాగు చట్టాల రద్దు మినహా ఏ ప్రతిపాదనైన పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. సాగు చట్టాలను రైతు సంఘాల నేతలు అర్థం చేసుకుంటాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. మరి చర్చల్లో ఎంత వరకు ఏకాభిప్రాయం వస్తుందో చూడాలి.
తాజాగా జరగనున్న 8వ విడత చర్చలకు ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాష్ నేతృత్వం వహించనున్నారు. ఇక ఈ చర్చల్లో 40 రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ చర్చల్లో కొత్త సాగు చట్టాల రద్దు, మద్ధతు ధరకు చట్ట భద్రత అంశాలే ప్రధానంగా చర్చకు రానున్నాయని సమాచారం.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకోవాలని రైతులు చేస్తోన్న ఆందోళన నేటితో 44వ రోజుకి చేరింది. ఈ నేపథ్యంలోనే రైతుల సంఘాలు, కేంద్రం మధ్య మరికాసేపట్లో 8వ విడత చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం సింఘు సరిహద్దు నుంచి రైతు సంఘాల నేతలు విజ్ఞాన్ భవన్‌కు బయలుదేరి వెళ్లారు.