లాక్​డౌన్​ నుంచి కేంద్రం మరికొన్ని సడలింపులు…

క‌రోనావైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్​డౌన్ మే3 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న విష‌యం తెల‌సిందే. ఆ త‌ర్వాత లాక్​డౌన్ పొడిగిస్తారా..లేదా అన్న విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కాగా ఇటీవ‌లే ​ లాక్​డౌన్ ఆంక్ష‌లకు సంబంధించి సడలింపుల చేసిన కేంద్రం..తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా మ‌రికొన్ని స‌డ‌లింపులు ఇస్తున్నట్లు అనౌన్స్ చేసింది. వ్యవసాయ సంబంధిత‌, ఎలక్ట్రికల్ షాపుల‌కు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. పుస్తక విక్రయాలకు ప‌ర్మిష‌న్ […]

లాక్​డౌన్​ నుంచి కేంద్రం మరికొన్ని సడలింపులు...
Telangana Lockdown

Updated on: Apr 23, 2020 | 8:13 PM

క‌రోనావైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్​డౌన్ మే3 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న విష‌యం తెల‌సిందే. ఆ త‌ర్వాత లాక్​డౌన్ పొడిగిస్తారా..లేదా అన్న విష‌యంపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కాగా ఇటీవ‌లే ​ లాక్​డౌన్ ఆంక్ష‌లకు సంబంధించి సడలింపుల చేసిన కేంద్రం..తాజాగా మరో కీలక ప్రకటన చేసింది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా మ‌రికొన్ని స‌డ‌లింపులు ఇస్తున్నట్లు అనౌన్స్ చేసింది. వ్యవసాయ సంబంధిత‌, ఎలక్ట్రికల్ షాపుల‌కు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. పుస్తక విక్రయాలకు ప‌ర్మిష‌న్ ఇస్తున్న‌ట్లు పేర్కొంది. స్టూడెంట్స్ బుక్స్ కొనుగోలు చేయవచ్చని తాజా సడలింపుల్లో చెప్పింది. సిమెంట్ యూనిట్ల కార్యకలాపాలు, రహదారి నిర్మాణ పనులు, మొబైల్‌ పాయింట్లకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.