
Sea Plane Services : సీ-ప్లేన్- నేల మీదే కాకుండా నీటిపై నుంచి కూడా టేకాఫ్ తీసుకునే ఈ బుల్లి విమానాలను జేమ్స్‌బాండ్ సినిమాల్లోనో.. అడ్వెంచర్ మూవీస్‌లోనే చూసే ఉంటాం. ఇన్నాళ్లూ బిగ్ స్క్రీన్‌పై చూసిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో స్వయంగా జర్నీ చేసే ఛాన్స్ వస్తే.. టికెట్ ధర కూడా అందుబాటులోనే ఉంటే.. ఎవరికి మాత్రం ఇందులో ప్రయాణించాలని ఉండదు. ఎగ్జాట్‌గా ఆ క్రేజే అందరిలోనూ కనిపిస్తోంది ఇప్పుడు. సీ ప్లేన్ సర్వీస్‌లు ఇలా ప్రారంభించగానే అలా ఫుల్ అన్ డిమాండ్ వచ్చేసింది.
గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని సర్దార్ పటేల్ ఐక్యతా శిల్పం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సీ ప్లేన్ సర్వీసు విజయవంతం కావడంతో ఇలాంటి ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్తగా 14 వాటర్ ఏరోడ్రోమ్‌లు నిర్మించాలని భావిస్తోంది.
ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీ కూడా ఉంది. వాటర్ ఏరోడ్రోమ్ అంటే ప్రయాణికులు సీ ప్లేన్ ఎక్కడానికి, దిగడానికి అనువుగా నదిలో నిర్మించే కాంక్రీట్ కట్టడం. ఇది నీటిపై ఎయిర్‌పోర్టు లాంటిదే. ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో సీ ప్లేన్ సేవలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర సర్కారు నిర్ణయానికి వచ్చింది.
ఇదిలావుంటే… సర్వీస్‌లను స్టార్ట్ చేసి 2 రోజులైందో లేదో.. అప్పుడే 3 వేల బుకింగ్స్ జరిగాయని స్పైస్‌జెట్ ప్రకటించింది. అహ్మదాబాద్ రీజియన్ నుంచే ఎక్కువ బుకింగ్స్ జరిగాయి. అహ్మదాబాద్– స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మధ్య సీప్లేన్ సర్వీస్ ధర రూ. 1500 నుంచి రూ. 5 వేల రూపాయలు. అహ్మదాబాద్ నుంచి కేవాడియాకు నాలుగుసార్లు విమాన సర్వీస్‌లు.. మొత్తం 8 ట్రిప్పులు ఉంటాయి. ఒకసారి ప్రయాణానికి టికెట్ ధర రూ. 4800. మొత్తం 18 మందితో సీప్లేన్ వెళ్లగలదు. ఈ విమానాన్ని సాయంత్రం 6 ఉపయోగించరు. 220 కిలోమీటర్ల ట్రిప్‌ను 45 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. టూరిజం పరంగా సరికొత్త అనుభూతిని కలిగించేందుకు ఈ విమానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.