సీఎం జగన్‌కు కేంద్రమంత్రి ఫోన్ కాల్.. కరోనా కేసులపై ఆరా..

Harsha Vardhan Phone Call To AP CM YS Jagan: ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రమంత్రి ఆరా తీశారు. ”రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 22 వేలకు పైగా టెస్టులు చేస్తున్నట్లు ఈ సందర్భంగా జగన్ ఆయనకు వివరించారు. రాష్ట్రంలో భారీగా కరోనా టెస్టులు నిర్వహించడంపైనే ఫోకస్ చేశామన్నారు. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి.. వెంటనే చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న […]

సీఎం జగన్‌కు కేంద్రమంత్రి ఫోన్ కాల్.. కరోనా కేసులపై ఆరా..

Updated on: Jul 16, 2020 | 1:42 AM

Harsha Vardhan Phone Call To AP CM YS Jagan: ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపధ్యంలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రమంత్రి ఆరా తీశారు. ”రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 22 వేలకు పైగా టెస్టులు చేస్తున్నట్లు ఈ సందర్భంగా జగన్ ఆయనకు వివరించారు. రాష్ట్రంలో భారీగా కరోనా టెస్టులు నిర్వహించడంపైనే ఫోకస్ చేశామన్నారు. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి.. వెంటనే చికిత్స అందిస్తున్నామన్నారు.

ప్రస్తుతం ఉన్న కరోనా మరణాల రేటును తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని జగన్ వివరించారు. అటు కరోనా నియంత్రణలో భాగంగా ఏపీకి కేంద్రం రూ. 179 కోట్లు ఇచ్చినట్లు హర్షవర్ధన్ తెలిపారు. కాగా, కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యశాఖ మంత్రులతో గత కొద్దిరోజులుగా కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఫోన్‌లో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.

Also Read:

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..

”వందేళ్ల జీవితం మార్కుల కంటే విలువైనది”.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..

మానవత్వాన్ని చాటుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. ప్రశంసించిన స్థానికులు..