ఉపరాష్ట్రపతి చొరవతో ఏపీకి రూ. 2,498 కోట్లు..

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల నుంచి ధాన్యం సేకరణకు సంబంధించిన చెల్లింపుల విషయంలో వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ..ఇటీవల సంబంధిత కేంద్ర మంత్రులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. మంత్రుల ఆదేశాలతో ఈ విషయంపై ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా… ఆహార, పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు జరపాల్సిన చెల్లింపులకుగానూ.. కేంద్ర ప్రభుత్వం రూ. 2,498.89 కోట్లను శుక్రవారం ఎఫ్‌సీఐకి విడుదల చేసింది. ఎఫ్‌సీఐ ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖకు […]

ఉపరాష్ట్రపతి చొరవతో ఏపీకి రూ. 2,498 కోట్లు..

Updated on: Mar 06, 2020 | 9:12 PM

ఆంధ్రప్రదేశ్‌లో రైతుల నుంచి ధాన్యం సేకరణకు సంబంధించిన చెల్లింపుల విషయంలో వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ..ఇటీవల సంబంధిత కేంద్ర మంత్రులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. మంత్రుల ఆదేశాలతో ఈ విషయంపై ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా… ఆహార, పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు జరపాల్సిన చెల్లింపులకుగానూ.. కేంద్ర ప్రభుత్వం రూ. 2,498.89 కోట్లను శుక్రవారం ఎఫ్‌సీఐకి విడుదల చేసింది. ఎఫ్‌సీఐ ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖకు బదిలీ చేయనుంది. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతికి కేంద్ర ఆహార, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ తెలియజేయగా..ఆయన హర్షం వ్యక్తం చేశారు.