Breaking: దేశంలో లాక్‌డౌన్‌ 5.0 అమలు

|

May 30, 2020 | 7:22 PM

దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, లాక్‌డౌన్‌ 5.0లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్‌డౌన్‌ 5.0 సడలింపు మార్గదర్శకాలు: ఫేజ్‌-1 * జూన్‌ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి. * జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతి. * కర్ఫ్యూ సమయం మరింత సడలింపు. రాత్రి 9గంటల […]

Breaking:  దేశంలో లాక్‌డౌన్‌ 5.0 అమలు
Follow us on

దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, లాక్‌డౌన్‌ 5.0లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

లాక్‌డౌన్‌ 5.0 సడలింపు మార్గదర్శకాలు:

ఫేజ్‌-1
* జూన్‌ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి.
* జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతి.
* కర్ఫ్యూ సమయం మరింత సడలింపు. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ

ఫేజ్‌-2
* పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం
* విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం
* విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇస్తుంది.

ఫేజ్‌-3
అంతర్జాతీయ విమాన ప్రయాణాలు (హోంశాఖ అనుమతుల మేరకు)
మెట్రో రైలు వ్యవస్థ
సినిమా హాళ్లు, జిమ్ములు, స్విమ్మింగ్ పూళ్లు, వినోద పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్ – సమావేశ ప్రదేశాలు
రాజకీయ, విద్యా, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు – భారీ సమూహాలకు ఆస్కారం ఉండే కార్యాక్రమాలు

లాక్‌డౌన్‌ 5.0 వీటికి అనుమతి లేదు

* మెట్రో రైలు సేవలకు ఇంకా అనుమతివ్వని కేంద్రం
* అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు
* సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు, బార్లకు అనుమతివ్వని కేంద్రం
* రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు

ఇక రాత్రి పూట కర్యూ సమయాన్ని కుదిస్తున్నట్లు వెల్లడించింది. రాత్రి తొమ్మిది నుంచి ఉదయం 5 గంటల వరకు సడలిస్తున్నట్లు తెలిపారు. మిగతా సమయాల్లో ప్రజలకు అనుమతినిస్తారు.