Celebrity Couples New Year Wishes: జంటగా న్యూఇయర్‌ శుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీలు..

Celebrity Couples : ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో న్యూఇయర్‌ విషెస్‌ హోరెత్తిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్‌ మీడియా వేదికగా...

Celebrity Couples New Year Wishes: జంటగా న్యూఇయర్‌ శుభాకాంక్షలు తెలిపిన సెలబ్రిటీలు..

Edited By: Balu

Updated on: Jan 01, 2021 | 6:24 PM

Celebrity Couples: ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో న్యూఇయర్‌ విషెస్‌ హోరెత్తిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్‌ మీడియా వేదికగా కొత్తేడాదికి ఆహ్వానం పలుకుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీ జంటలు చేసిన పోస్ట్‌లు నెటిజెన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తమ భాగస్వాములతో కొందరు ఫొటోలు దిగితే.. మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు. మరి సెలబ్రిటీ కపుల్స్‌ పోస్ట్‌ చేసిన ఫొటోలు వాటికి ఇచ్చిన క్యాప్షన్లపై ఓ లుక్కేద్దామా..

సమంత..
అందరికీ కొత్తేడాది శుభాకాంక్షలు. ఈ ఏడాది మీరంతా సంతోషంగా, ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నాను.

కాజల్‌ అగర్వాల్‌..

‘హ్యాపీ న్యూ ఇయర్‌.. ఈ ఏడాది అందరి జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.

సోనమ్‌ కపూర్..

నా ప్రియమైన పాట్నర్‌తో ఈ ఏడాది మొత్తాన్ని సంతోషంగా గడపడానికి సిద్ధంగా ఉన్నాను. అందరి జీవితాల్లో ప్రేమ, ఫ్యామిలీ, స్నేహితులు, ప్రయాణం.. ఇంకా చాలా మంచి విషయాలతో ఈ ఏడాది నిండిపోవాలని కోరుకుంటున్నాను. మనజీవితాల్లో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను.


నమ్రతా శిరోద్కర్‌..

2020 సంవత్సరం మనకు సహనం, స్నేహం, కృతజ్ఞతలు వంటి ఎన్నో విషయాలను నేర్పించింది. మనకు భవిష్యత్తులో మంచి జరగనుంది. అందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను.


అల్లు స్నేహ రెడ్డి..

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

విఘ్నేశ్‌..

మనం ఇప్పుడు జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని ఓ కీలక ఘట్టాన్ని దాటాం. అంతా మంచే జరగాలని కోరుకుంటూ 2021 వైపు అడుగులు వేద్దాం. ఈ ఏడాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌.

Also Read: Sreekaram Movie : కొత్త సంవత్సరానికి ఇలా ‘శ్రీకారం’.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్