కిచెన్ లో.. టీవీ నటి అనుమానాస్పద మృతి!

| Edited By:

Dec 25, 2019 | 5:36 AM

ప్రముఖ టీవీ యాంకర్, సెలబ్రిటీ చెఫ్, ఇన్‌స్టాగ్రామ్ సంచలనం జాగీ జాన్ సోమవారం తిరువనంతపురంలోని కురవంకోణం వద్ద ఆమె ఇంట్లో శవమై కనిపించారు. ఆమె తల్లితో కలిసి నివసిస్తున్న ఫ్లాట్ వంటగదిలో శవమై కనిపించారు. ఈ కేసును విచారిస్తున్న పెరూర్కాడ పోలీసులు మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదని, అసహజ మరణం కేసు నమోదు చేశామని తెలిపారు. 38 ఏళ్ల జాగీ జాన్ ఫ్యాషన్, మ్యూజిక్, ఫిట్ నెస్ ప్రపంచంలో సుపరిచితం. ఒక ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో […]

కిచెన్ లో.. టీవీ నటి అనుమానాస్పద మృతి!
Follow us on

ప్రముఖ టీవీ యాంకర్, సెలబ్రిటీ చెఫ్, ఇన్‌స్టాగ్రామ్ సంచలనం జాగీ జాన్ సోమవారం తిరువనంతపురంలోని కురవంకోణం వద్ద ఆమె ఇంట్లో శవమై కనిపించారు. ఆమె తల్లితో కలిసి నివసిస్తున్న ఫ్లాట్ వంటగదిలో శవమై కనిపించారు. ఈ కేసును విచారిస్తున్న పెరూర్కాడ పోలీసులు మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదని, అసహజ మరణం కేసు నమోదు చేశామని తెలిపారు.

38 ఏళ్ల జాగీ జాన్ ఫ్యాషన్, మ్యూజిక్, ఫిట్ నెస్ ప్రపంచంలో సుపరిచితం. ఒక ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో ప్రసారమైన వంటల ప్రదర్శనలో సెలబ్రిటీ చెఫ్ గా తనదైన ముద్ర వేసింది. జ్ఞాపకశక్తితో బాధపడుతున్నట్లు కనిపిస్తున్న జాగీ తల్లి వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. తన కూతురు నేలమీద కుప్పకూలినప్పుడు వంటగదిలో వంట చేస్తుందని ఆమె పోలీసులకు తెలిపింది. మృతదేహం పై ఎటువంటి గాయాలు లేవని, శవపరీక్ష తర్వాతే ఒక నిర్ణయానికి రాగలమని పోలీసులు తెలిపారు.