”భారతదేశంలో 70 శాతం ఆ జన్యురకమే ఉంది”: సీసీఎంబీ పరిశోధనలు..

|

Sep 20, 2020 | 9:44 PM

భారతదేశంలో ఉన్న SARS-COV-2కు సంబంధించి రెండు వేలకు పైగా ఉన్న జన్యుక్రమలపై సీసీఎంబీ సైంటిస్టులు పరిశోధనలు జరిపారు.

భారతదేశంలో 70 శాతం ఆ జన్యురకమే ఉంది: సీసీఎంబీ పరిశోధనలు..
Follow us on

భారతదేశంలో ఉన్న SARS-COV-2కు సంబంధించి రెండు వేలకు పైగా ఉన్న జన్యుక్రమలపై సీసీఎంబీ సైంటిస్టులు పరిశోధనలు జరిపారు. ఇక అంతముందు జూన్‌లో, భారతీయుల్లో ప్రత్యేకమైన వైరస్ ఉన్నట్లు ఈ బృందం వెల్లడించింది. ఇక ఇప్పుడు తాజాగా చేసిన పరిశోధనల్లో ఇండియాలో 70 శాతం ఏ2ఏ జన్యురకం ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే రకం ఎక్కువగా ఉందని సంస్థ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు. ఇది మనకు ఓ సానుకూలాంశం అని చెప్పిన ఆయన.. ఈ మ్యుటేషన్ లక్ష్యంగా చేసుకున్న వాక్సిన్ లేదా డ్రగ్ ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రభావం చూపుతాయని వెల్లడించారు. (SARS-CoV-2 Genomes)

భారత్‌లో A3I జన్యురకం 18 శాతం మాత్రమే ఉందన్న సీసీఎంబీ.. జూన్ మొత్తం SARS-CoV-2 జన్యువులలో 41 శాతం ఈ క్లాడ్‌కు చెందినవే అని స్పష్టం చేశారు. RDRP అనే కీలకమైన ప్రోటీన్‌లో మ్యుటేషన్ ఉండడం వల్ల మిగతా రకాల కన్నా A3I రకం వ్యాప్తి తక్కువగా ఉంటుందని సీసీఎంబీ భావిస్తోంది. అలాగే A2Aలోని స్పైక్ ప్రోటీన్‌లో D614G అనే మ్యుటేషన్ ఉండటం వల్ల ఎక్కువ వ్యాప్తి జరిగిందని పరిశోధనల్లో తేలిందన్నారు. కాగా, ఈ SARS-CoV-2 జన్యువులలో ఏ రకం ఎంత తీవ్రమైనదన్నది ఖచ్చితంగా ఎక్కడా కూడా చూపించబడలేదని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..