CBSE 10th Result 2023: 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్స్ డేట్,టైమ్ ఎప్పుడంటే..

|

Apr 24, 2023 | 3:09 PM

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాలు ఎప్పుడు అనే తొందర విద్యార్థుల్లో కనిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రకటన రాబోతోంది. విడుదలైన తర్వాత వాటిని ఎలా చెక్ చేసుకోవలోఇక్కడ తెలుసుకోండి.

CBSE 10th Result 2023: 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్స్ డేట్,టైమ్ ఎప్పుడంటే..
Cbse Result
Follow us on

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) త్వరలో 10వ తరగతి ,12వ తరగతి ఫలితాలను 2023లో ప్రకటించే అవకాశం ఉంది. విద్యార్థుల నిరీక్షణ త్వరలో ముగియవచ్చని తెలుస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి ఫలితాలు ఈ వారం చివరిలోగా విడుదల చేయబడతాయి. CBSE బోర్డ్ 10వ, 12వ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్ల లేదా మరో వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విడుదలైన తర్వాత, విద్యార్థులు దిగువ పేర్కొన్న పద్దతిని అనుసరించడం ద్వారా ఈ వెబ్‌సైట్‌ల నుంచి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

CBSE బోర్డ్ 10వ పరీక్షలు 15 ఫిబ్రవరి నుంచి 21 మార్చి 2023 మధ్య జరిగాయి. ఈసారి CBSE 10వ తరగతికి 18 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వారంతా ఇప్పుడు ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. CBSE 10వ తరగతి కాపీల మూల్యాంకనం ఏప్రిల్ మధ్యలో పూర్తయింది. ఏప్రిల్ నెలాఖరులోగా ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు.

విడుదల తర్వాత ఇలా చెక్ చేసుకోండి..

  1. ఫలితం విడుదలైన తర్వాత చెక్  చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ అంటే కి వెళ్లండి.
  2. ఇక్కడ CBSE బోర్డ్ 10వ ఫలితం అనే లింక్ ఇవ్వబడుతుంది, దానిపై క్లిక్ చేయండి.
  3. మీరు ఇలా చేసిన వెంటనే, తెరిచిన పేజీలో మీ రిజిస్ట్రేషన్ నంబర్ మొదలైన వివరాలను నమోదు చేసి సమర్పించండి.
  4. ఇలా చేయడం ద్వారా, మీ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  5. వాటిని ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి.. ఆ తర్వాత వాటిని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు కావాలంటే ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.

SMS ద్వారా ఈ విధంగా ఫలితాన్ని చెక్ చేసుకోండి

వెబ్‌సైట్ నుంచి ఫలితాలను చెక్ చేసుకోవడంలో ఏదైనా సమస్య ఉంటే.. రిజల్ట్స్‌ను SMS ద్వారా కూడా తనిఖీ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవడానికి, ఫోన్‌లోని మెసేజ్ విభాగానికి వెళ్లి, CBSE10 అని టైప్ చేసి మీ రోల్ నంబర్‌ని టైప్ చేసి, ఈ మొబైల్ నంబర్‌కి పంపండి – 7738299899. వెంటనే మీ ఫోన్‌కు మెసెజ్ రూపంలో రిజల్ట్స్ వస్తాయి. 12వ తరగతి ఫలితాలు కూడా ఇలానే చేయాలి.

మరిన్ని కెరీర్ న్యూస్ కోసం