Cbse Board Exam: సీబీఎస్ఈ పరీక్ష తేదీలను ప్రకటించిన కేంద్రం.. ఎప్పటి నుంచి మొదలంటే.. 

|

Dec 31, 2020 | 6:40 PM

Cbse Board Exam: సీబీఎస్ఈ పరిధిలోకి వచ్చే విద్యాసంస్థల్లో నిర్వహించే వార్షిక పరీక్షల తేదీలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటిచింది. 10,12 తరగతుల పరీక్ష తేదీలను..

Cbse Board Exam: సీబీఎస్ఈ పరీక్ష తేదీలను ప్రకటించిన కేంద్రం.. ఎప్పటి నుంచి మొదలంటే.. 
Follow us on

Cbse Board Exam Time Table: 2020-2021 విద్యాసంవత్సరానికి గాను సీబీఎస్ఈ పరిధిలోకి వచ్చే విద్యాసంస్థల్లో నిర్వహించే వార్షిక పరీక్షల తేదీలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటిచింది. 10,12 తరగతుల పరీక్ష తేదీలను మే 4 నుంచి జూన్ 10 వరకు జరపునున్నట్లు తెలిపారు. ఇక పరీక్ష ఫలితాలను జూలై 15న విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ తేదీన ఏ పరీక్ష జరుగుతుందన్న పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
ఇదిలా ఉంటే ఈ విద్యా సంవత్సరంలో కూడా పరీక్షలను రాతపూర్వక విధానంలోనే నిర్వహిస్తామని సీబీఎస్ఈ బోర్డు గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా పాఠశాలలు మూతపడంతో ఈసారి  సిలబస్‌ను తగ్గించనున్నారు. నిజానికి మార్చిలోనే నిర్వహించాల్సిన పరీక్షలను కొన్ని రాష్ట్రాల్లో తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు వాయిదా వేశారు.

Also Read: Love for dogs: కొడుకుపై కోపం..పెంపుడు శునకానికి రెండెక‌రాల భూమి రాసిన తండ్రి..చివర్లో ట్విస్ట్ ఏంటంటే..?