AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీబీఎస్ఈ 2021 పరీక్షల తేదీలు ఖరారు.. జనవరి 1 నుండి 12వ తరగతి ప్రాక్టికల్స్..!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్ష తేదీలను ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు కొత్త మార్గదర్శకాలతో పరీక్ష తేదీలను ఎంహెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ విడుదల చేసింది.

సీబీఎస్ఈ 2021 పరీక్షల తేదీలు ఖరారు.. జనవరి 1 నుండి 12వ తరగతి ప్రాక్టికల్స్..!
Balaraju Goud
|

Updated on: Nov 21, 2020 | 10:20 PM

Share

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్ష తేదీలను ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు కొత్త మార్గదర్శకాలతో పరీక్ష తేదీలను ఎంహెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ విడుదల చేసింది. సీబీఎస్ఈ 12 వ తరగతి ప్రాక్టికల్ పరీక్ష తేదీని శనివారం విడుదల చేసింది. సిబిఎస్‌ఇ 12 వ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 1 నుండి ఫిబ్రవరి 8 వరకు జరుగుతాయని తెలిపింది. అయితే కరోనా నేపథ్యంలో పరీక్ష తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఖచ్చితమైన తేదీలను తరువాత విడిగా తెలియజేస్తామని వెల్లడించింది.

ప్రాక్టికల్ పరీక్ష నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేసింది. ప్రాక్టికల్ పరీక్షల కోసం పాఠశాలలకు వేర్వేరు తేదీలను పంపుతామని బోర్డు తెలిపింది. ప్రాక్టికల్ పరీక్ష, ప్రాజెక్ట్ మూల్యాంకనాన్ని పర్యవేక్షించేందుకు బోర్డు తరపున ఒక పరిశీలకుడిని నియమిస్తున్న పేర్కొంది. ప్రాక్టికల్ పరీక్షలో గత ఏడాది లాగే ఇతర పాఠశాలలకు చెందిన పరీక్షకులు ఉంటారని, సీబీఎస్‌ఈ బోర్డు నియమించిన పరీక్షకుడు మాత్రమే ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తారని తెలిపింది. అన్ని పాఠశాలలకు సంబంధించి యాప్ లింక్ ద్వారా ప్రాక్టికల్ పరీక్ష సమయంలో ప్రతి బ్యాచ్ విద్యార్థుల సమూహ ఫోటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కాగా, గ్రూప్ ఫోటోలో ప్రాక్టికల్ గివింగ్ బ్యాచ్, ఎక్సటర్నల్ ఎగ్జామినర్, ఇంటర్నల్ ఎగ్జామినర్, ఎగ్జామ్ అబ్జర్వర్, విద్యార్థులందరూ ఉంటారు. ప్రతి ఒక్కరి ముఖం ఫోటోలో కనిపించాలని సూచించింది

సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి మాట్లాడుతూ.. 10 వ తరగతి, 12 వ తరగతికి బోర్డు పరీక్షలు ఉంటాయని, వాటి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించాలని భావిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కరోనా నేపథ్యంలో పరీక్ష ఎలా మదింపు చేయబడుతుందో త్వరలో తెలుస్తుందన్నారు. కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోర్డు పరీక్షలను రద్దు చేయాలని, లేదా వాయిదా వేయాలని వివిధ సంస్థలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో త్రిపాఠి ఈ ప్రకటన చేశారు. అయితే, పరీక్ష ఫార్మాట్‌పై ఇప్పటివరకు స్పష్టత లేదు. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి-మార్చిలో జరుగుతాయా లేదా అన్నదానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేకపోయారు. మరోవైపు, విద్యార్థులకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివిధ యాప్ ల ద్వారా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని త్రిపాఠి వెల్లడించారు.