యువకుల్ని బానిసలుగా మారుస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ గేములు నిషేధిస్తూ తమిళనాడు సర్కారు ఆర్డినెన్స్

యువకుల్ని బానిసలుగా మారుస్తూ అదొక వ్యసనంలా మార్చేస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ గేముల ఆటకట్టిస్తున్నాయి ఆయా రాష్ట్రాలు. ఈ కోవలోకి తాజాగా తమిళనాడు సర్కారు కూడా చేరింది. ఇటీవల ఈ బెట్టింగుల కారణంగా నష్టపోయిన యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ప్రతిపదికగా తీసుకుని తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. బెట్టింగులు ఉండే ఆన్‌లైన్ గేములను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇకపై, ఈ ఆదేశాలను ధిక్కరించే వారికి జరిమానాతోపాటు రెండేళ్ల జైలుశిక్ష కూడా విధించనున్నట్టు ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్ర […]

యువకుల్ని బానిసలుగా మారుస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ గేములు నిషేధిస్తూ తమిళనాడు సర్కారు ఆర్డినెన్స్

యువకుల్ని బానిసలుగా మారుస్తూ అదొక వ్యసనంలా మార్చేస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ గేముల ఆటకట్టిస్తున్నాయి ఆయా రాష్ట్రాలు. ఈ కోవలోకి తాజాగా తమిళనాడు సర్కారు కూడా చేరింది. ఇటీవల ఈ బెట్టింగుల కారణంగా నష్టపోయిన యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ప్రతిపదికగా తీసుకుని తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. బెట్టింగులు ఉండే ఆన్‌లైన్ గేములను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇకపై, ఈ ఆదేశాలను ధిక్కరించే వారికి జరిమానాతోపాటు రెండేళ్ల జైలుశిక్ష కూడా విధించనున్నట్టు ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై గవర్నర్ బన్వర్‌లాల్ పురోహిత్ ఆర్డినెన్స్ జారీ చేశారు. కంప్యూర్ కానీ, మరే ఇతర కమ్యూనికేషన్ పరికరాన్ని కాని ఉపయోగించి ఆన్‌లైన్‌లో పందెం కాయడాన్ని నిషేధిస్తున్నట్టు ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ దొరికితే రూ. 5వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష, గేమింగ్ హౌస్ నిర్వాహకులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించనున్నారు. కాగా, ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆన్‌లైన్ గేమింగును నిషేధించిన సంగతి తెలిసిందే.