మలయప్పస్వామికి పుష్పనివేదన …14 రకాల కుసుమాలు… 6 రకాల పత్రాలతో స్వామివారికి పూజ

శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కళ్యాణ మండపం వేదికగా మారింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి పుష్పయాగ మహోత్సవం ఇవాళ మధ్యాహ్నం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్చారణతో పుష్ప యాగం ఘనంగా నిర్వహించారు.

  • Sanjay Kasula
  • Publish Date - 10:26 pm, Sat, 21 November 20
మలయప్పస్వామికి పుష్పనివేదన ...14 రకాల కుసుమాలు... 6 రకాల పత్రాలతో స్వామివారికి పూజ

TTd Pushpayagam : తిరుమల శ్రీవారి ఆలయంలో మలయప్పస్వామికి పుష్పయాగం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి వేద పండితులు మంత్రోచ్చారణతో పుష్ప యాగం ఘనంగా జరిపారు.

శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కళ్యాణ మండపం పుష్పనిదవేదనకు వేదికగా మారింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి పుష్పయాగ మహోత్సవం ఇవాళ మధ్యాహ్నం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్చారణతో పుష్ప యాగం ఘనంగా నిర్వహించారు.

పుష్పయాగానికి తమిళనాడు, కర్నాటక, ఏపీ, తెలంగాణ నుంచి 7 టన్నుల పుష్పాలు, పత్రాలను భక్తులు విరాళంగా అందించారు.ఇందులో వివిధ రకాల పుష్పాలతో 20 సార్లు స్వామి వార్లను అర్చించారు వేద పండితులు. చామంతి, వృక్షి, సంపంగి, సెంటు జాజులు, పొగ‌డ‌, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మానసంపంగి పుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో పుష్పయాగం నిర్వహించారు. ఆ సమయంలో సువాసనా భరితమైన రకరకాల పుష్పాలు.. పచ్చని పత్రాలతో నిండుగా నిండిన దేవదేవుని సౌందర్యం.. చూసిన వారిదే భాగ్యం.

అయితే.. ప్రతి ఏటా కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రంలో ఈ పుష్పయాగం చేస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకులు, ఉద్యోగులు, భక్తుల వల్ల ఏవైనా దోషాలు జరిగితే వాటి నివారణకు ఇలా పుష్పయాగం నిర్వహించడం సంప్రదాయం.
పుష్పయాగం సందర్భంగా ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దుచేసింది