ఏపీ విద్యార్థులతో సీఎం జగన్ చుట్టరికం.. వరుస ఇదే

|

Jan 09, 2020 | 2:08 PM

ఏపీలోని విద్యార్థులందరికీ తాను ఇకపై కేర్ టేకర్ మేనమామనని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. అమ్మ ఒడి కార్యక్రమానికి చిత్తూరు పట్టణంలో శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి ఆ తర్వాత అమ్మ ఒడి పథకం వెనుక తనకు ప్రేరణ ఏంటో వివరించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ చదివే ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకం కింద వారి తల్లి అకౌంట్‌లో ప్రతీ ఏడు పదిహేను వేల రూపాయలు జమ అవుతాయని, ఈ డబ్బులతో పిల్లలకు చక్కని ఆహారం పెడుతూ […]

ఏపీ విద్యార్థులతో సీఎం జగన్ చుట్టరికం.. వరుస ఇదే
Follow us on

ఏపీలోని విద్యార్థులందరికీ తాను ఇకపై కేర్ టేకర్ మేనమామనని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. అమ్మ ఒడి కార్యక్రమానికి చిత్తూరు పట్టణంలో శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి ఆ తర్వాత అమ్మ ఒడి పథకం వెనుక తనకు ప్రేరణ ఏంటో వివరించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ చదివే ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకం కింద వారి తల్లి అకౌంట్‌లో ప్రతీ ఏడు పదిహేను వేల రూపాయలు జమ అవుతాయని, ఈ డబ్బులతో పిల్లలకు చక్కని ఆహారం పెడుతూ వారిని ప్రగతిపథంలోకి పంపించాలని సీఎం సూచించారు.

ఒకవేళ తల్లులు బ్యాంకులకు అప్పులు ఉంటే ఈ డబ్బులు వాళ్ళు కట్ చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు సీఎం. రెక్కడితేగాని డొక్కాడని కుటుంబాల్లో పిల్లల చదువులు డబ్బులు లేక ఆగకూడదన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చామని ఆయన వెల్లడించారు. అకౌంట్లో వేసే డబ్బులను కేవలం పిల్లల చదువుల కోసమే వినియోగించాలని తల్లులకు ఆయన సూచించారు. వచ్చే ఏడాది నుంచి ప్రతీ విద్యార్థికి 75శాతం అటెండెన్స్ కచ్చితంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో 75 శాతం అటెండెన్స్ లేకపోయినా అమ్మఒడి పధకం ఇస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి ఈ మినహాయింపు వుండదని చెప్పారు సీఎం. మేనిఫెస్టోలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అని చెప్పామని, కానీ దాన్ని ఇంటర్మీడియట్ వరకు పెంచామని అన్నారాయన. ‘‘ ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలా వద్దా అని మిమ్మల్నే అడుగుతున్నాను.. ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలని చంద్రబాబుకి, ఒక సినిమా యాక్టర్‌కి వినిపించేలా గట్టిగా చెప్పండి..’’ అంటూ సీఎం సభా ముఖంగా పిలుపునిచ్చారు.

వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ప్రవేశపెడుతున్నామని, ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతిని పెంచుతూ పదో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం కంపల్సరీ చేస్తామని చెప్పారు. బోర్డు పరీక్షలు పిల్లలు ఇంగ్లీష్‌లో రాసేలా తయారు చేస్తామని ప్రకటించారు సీఎం.