పొంగిపొర్లుతున్న వాగులు.. కొట్టుకుపోయిన కారు

|

Jul 10, 2020 | 5:12 PM

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇదే ఈ క్రమంలో బోనకల్లు మండలం చిన్న బీరవల్లి గ్రామ సమీపంలోని వాగు వరద ఉదృతికి పోటెత్తింది. దీంతో ఇరువైపుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, వరద ఉదృతికి తాళలేక కారు వాగులో కొట్టుకుపోయింది.

పొంగిపొర్లుతున్న వాగులు.. కొట్టుకుపోయిన కారు
Follow us on

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇదే ఈ క్రమంలో బోనకల్లు మండలం చిన్న బీరవల్లి గ్రామ సమీపంలోని వాగు వరద ఉదృతికి పోటెత్తింది. దీంతో ఇరువైపుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, వరద ఉదృతికి తాళలేక కారు వాగులో కొట్టుకుపోయింది. బోనకల్లు వెళ్లేందుకు ఇండికా కారులో నలుగురు వ్యక్తులు వచ్చారు. వాగుపై బ్రిడ్జిని దాటేక్రమంలో వరద ఉదృతి పెరగడంతో కారు వాగులో కొట్టుకుపోయింది. స్థానికులు వెంటనే వాగులోకి దూకి నలుగురికి రక్షించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.

అటు, వైరా జగ్గయ్యపేట ప్రధాన రోడ్డుమార్గంలో జానకిపురం వద్ద రహదారికి మరమ్మతు పనులు జరుగుతున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయంగా మారాయి. బురదగా ప్రధాన రహదారిలో రెండు లారీలు దిగుబడిపోయాయి. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.