ఉత్తర భారత యువతలో స్కిల్స్ లేవు..కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

|

Sep 16, 2019 | 1:49 AM

నిరుద్యోగంపై కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకున్నాయి. శనివారం ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘దేశంలో ఉద్యోగాలకు కొదవలేదు. కానీ వాటి కోసం దరఖాస్తు చేసుకుంటున్న ఉత్తర భారతానికి చెందిన అభ్యర్థుల్లో తగిన నైపుణ్యాలు ఉండటం లేవు’ అని పేర్కొన్నారు. గాంగ్వర్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకులు దీటుగా స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి క్షమాపణలు చెప్పాలంటూ పలువురు నాయకులు డిమాండు చేశారు. […]

ఉత్తర భారత యువతలో స్కిల్స్ లేవు..కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
Job opportunities in plenty, lack of capability in north Indians: Labour minister Santosh Gangwar
Follow us on

నిరుద్యోగంపై కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకున్నాయి. శనివారం ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘దేశంలో ఉద్యోగాలకు కొదవలేదు. కానీ వాటి కోసం దరఖాస్తు చేసుకుంటున్న ఉత్తర భారతానికి చెందిన అభ్యర్థుల్లో తగిన నైపుణ్యాలు ఉండటం లేవు’ అని పేర్కొన్నారు. గాంగ్వర్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకులు దీటుగా స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి క్షమాపణలు చెప్పాలంటూ పలువురు నాయకులు డిమాండు చేశారు.

దీనిపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. ‘ఉద్యోగాలను కల్పించడంలో కేంద్రాన్ని విఫలమైంది. మంత్రిగారూ.. మీరు ఐదేళ్లుగా అధికారంలో ఉన్నారు. ఈ ఐదేళ్లలో మీరు కొత్త ఉద్యోగాలు సృష్టించలేదు. అంతేకాకుండా ఆర్థిక మందగమనం కారణంగా ఉన్న ఉద్యోగాలను సైతం పోయేలా చేశారు. ప్రభుత్వం మాకోసం ఏవైనా మంచి నిర్ణయాలు తీసుకుంటుందని దేశంలో ఉన్న నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్నారు. కానీ మీరు మాత్రం ఉత్తర భారతదేశానికి చెందిన వారిని అవమానించి తప్పించుకోవాలని చూస్తున్నారు’ అని ఆమె విమర్శించారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘దేశం ఆర్థిక ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.