ఛత్‌పూజా ఊరేగింపులను నిషేధించిన కోల్‌కతా హైకోర్టు

|

Nov 11, 2020 | 5:19 PM

పశ్చిమ బెంగాల్‌లో ఈసారి ఛత్‌ పూజా ఊరేగింపులు కూడా ఉండవు.. ఇప్పటికే దీపావళి పండుగ రోజున బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించిన కోల్‌కతా హైకోర్టు ఇప్పుడు ఛత్‌పూజా ఊరేగింపులను కూడా నిలిపివేసింది.. కోత్‌కతాలోని రెండు పెద్ద సరస్సులు సుభాష్‌, రవీంద్ర సరోవర్‌లోకి ప్రజలు వెళ్లకూడదని హైకోర్టు గట్టిగా చెప్పింది.. ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పూజలు చేయడానికి ఏదైనా చెరువులోకో సరస్సులోకో వెళ్లవచ్చునని, వాహనాలలో వచ్చే వారు నిర్ణీత దూరాన్ని పాటించాల్సి ఉంటుందని హైకోర్టు సూచించింది. […]

ఛత్‌పూజా ఊరేగింపులను నిషేధించిన కోల్‌కతా హైకోర్టు
Follow us on

పశ్చిమ బెంగాల్‌లో ఈసారి ఛత్‌ పూజా ఊరేగింపులు కూడా ఉండవు.. ఇప్పటికే దీపావళి పండుగ రోజున బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించిన కోల్‌కతా హైకోర్టు ఇప్పుడు ఛత్‌పూజా ఊరేగింపులను కూడా నిలిపివేసింది.. కోత్‌కతాలోని రెండు పెద్ద సరస్సులు సుభాష్‌, రవీంద్ర సరోవర్‌లోకి ప్రజలు వెళ్లకూడదని హైకోర్టు గట్టిగా చెప్పింది.. ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పూజలు చేయడానికి ఏదైనా చెరువులోకో సరస్సులోకో వెళ్లవచ్చునని, వాహనాలలో వచ్చే వారు నిర్ణీత దూరాన్ని పాటించాల్సి ఉంటుందని హైకోర్టు సూచించింది. ఇతర కుటుంబసభ్యులు ఇంటి నుంచి లేదా ఇంటి దగ్గరలో పూజలు చేసుకోవాలని చెప్పింది..ప్రజలు ఒకే చోట గుమిగూడవద్దని, ప్రతి ఒక్కరు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని తెలిపింది. కోవిడ్‌-19 నిబంధనలను కచ్చితంగా పాటించాలంది.. ఈనెల చివరి వరకు బాణాసంచా కాల్చడంపై హైకోర్టు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిషేధం విధించాయి కాబట్టి నగరంలో ఎలాంటి పటాసులు అమ్మకూడదనంటున్నారు పోలీసులు.. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిషేధం విధించినప్పటికీ గత ఏడాది రవీంద్ర సరోవర్‌ ద్వారాలను తెరచి భారీ సంఖ్యలో ప్రజలు నీటిలోకి ప్రవేశించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కోల్‌కతా హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.. అవసరమైతే 144 సెక్షన్‌ విధించాలని చెప్పింది..