పంజాబ్‌లో బిల్డింగ్‌ కూలి ఇద్దరు మృతి.. శిథిలాల కింద మరికొందరు.. !

|

Sep 24, 2020 | 2:04 PM

పంజాబ్‌ రాష్ట్రంలో బిల్డింగ్‌ కూలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘనటలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

పంజాబ్‌లో బిల్డింగ్‌ కూలి ఇద్దరు మృతి.. శిథిలాల కింద మరికొందరు.. !
Follow us on

కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనాలు కుప్పకూలుతున్నాయి. మహారాష్ట్రలోని భివాండీలో భవనం కుప్పకూలి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. పంజాబ్‌ రాష్ట్రంలో బిల్డింగ్‌ కూలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘనటలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మొహాలి జిల్లాలోని డేరాబస్సీలో గురువారం ఉదయం ఒక భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తెలిపాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు వెల్లడించాయి. వారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన వారి ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.