BSNL Special Offer: బీఎస్‌ఎన్‌ఎల్.. భారత టెలికాం రంగంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిందీ సంస్థ. ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగడం.. విపరీతమైన పోటీ పెరగడంతో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. అయితే ఇదే సమయంలో తనకు ఉన్న కస్టమర్లను జారిపోనికుండా, కొత్త యూజర్లను ఆకర్షించే క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదండోయ్.. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే.
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంపిక చేసుకున్న ప్లాన్లపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు బీఎస్‌ఎనల్ ప్రకటించింది.
ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్, ఫైబర్ టు హోం ఇంటర్నెట్ ప్లాన్లపై కూడా ఈ డిస్కౌంట్ అందించనుంది. ఈ ఆఫర్‌ను వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నారు. ల్యాండ్ లైన్ నుంచి ఫైబర్ టూ హోం ప్లాన్ల వరకు ఏ రీచార్జ్ ప్లాన్ ఎంచుకున్నా దానిపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. ఇదిలా ఉంటే బీసీఎన్‌ఎల్ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం డిస్కౌంట్ అందిస్తుండగా.. ఇప్పుడు ఆ డిస్కౌంట్ ను 10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.