Viral Video: విందులో గంజాయి కలిపిన పెళ్లికూతురు.. ఆ తర్వాత సీన్ సితారే మరి..!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సందర్భంగా కొన్ని పెళ్లి వార్తలు, ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వార్తే ఇది కూడా..పెళ్లికి వచ్చిన అతిథులను సరదాగా ఆటపట్టిద్దామనకున్న ఓ పెళ్లి కూతురు.. పెళ్లి వంటకాల్లో గంజాయిని కలిపింది.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సందర్భంగా కొన్ని పెళ్లి వార్తలు, ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వార్తే ఇది కూడా..పెళ్లికి వచ్చిన అతిథులను సరదాగా ఆటపట్టిద్దామనకున్న ఓ పెళ్లి కూతురు.. పెళ్లి వంటకాల్లో గంజాయిని కలిపింది. పాపం ఇవేవీ తెలియని అతిథులు పెళ్లి విందును ఆరగించారు. ఆ తర్వాత ఒక్కొక్కరూ అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయారు. పెళ్లి వేడుకలో అసలు ఏం జరుగుతందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆస్పత్రికి తీసుకెళితే కానీ అసలు విషయం తెలియలేదు ఆహారంలో గంజాయి మిక్స్ చేశారని. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెళ్లికూతురితో పాటు క్యాటరింగ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఫ్లోరిడాకు చెందిన దాన్య అనే అమ్మాయి ఇటీవల పెళ్లిచేసుకుంది. సుమారు 50 మంది వరకు అతిథులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్లి విందును ఆరగించిన తర్వాత ఒక్కొక్కరూ స్పృహతప్పి పడిపోయారు. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లాక పెళ్లి వంటకాల్లో గంజాయి కలిపారని, అందుకే అతిథులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు తెలిపారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు పెళ్లి కూతురే ఈ పనికి పాల్పడిందని నిగ్గుతేల్చారు. అతిథులను ఆటపట్టించేందుకే తాను ఈ పని చేసినట్లు విచారణలో పేర్కొంది. దీంతో గంజాయి వాడినందుకు ఆమెతో పాటు క్యాటరింగ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!

