Brahmapureeswarar Temple: బ్రహ్మ తన తలరాతను తానే మార్చుకున్న దివ్య క్షేత్రం.. ఇక్కడ శివుడిని పూజించిన భక్తుల కష్టాలు మాయం

|

Jan 28, 2021 | 1:22 PM

ఈ క్షేత్రంలో కొలువైన బ్రహ్మ, బ్రహ్మపురీశ్వర శివాలయం ఆశీర్వాదం కోరుతూ పూజిస్తే తమ విధి రాత మారుతుందని భక్తులు నమ్ముతారు. మన జీవితంలో మంచిని తెచ్చే ఆలయంగా బ్రహ్మ దేవుడి ఆలయం ప్రసిధ్ధి చెందింది..

Brahmapureeswarar Temple:  బ్రహ్మ తన తలరాతను తానే మార్చుకున్న దివ్య క్షేత్రం.. ఇక్కడ శివుడిని పూజించిన భక్తుల కష్టాలు మాయం
Follow us on

Brahmapureeswarar Temple:  తమిళనాడులో ఎన్నో ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్నాయి. అవి వారి సాంస్కృతిక చిహ్నాలుగా వెలుగొందుతున్నాయి. త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు ఆలయాలు బహుతక్కువ అన్న సంగతి తెలిసిందే. మరి అటువంటి శాపం పోగొట్టుకోవడానికి శివుడిని పూజించి తన తలరాతను తానే మార్చుకుని ప్రాంతం తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తిరుపత్తూర్ లో ఉంది. ఈ ఆలయంలో ప్రధానం శివ పార్వతులు పూజలందుకుంటున్నా.. బ్రహ్మ దేవుడుకూడా కొలువై ఉన్నాడు. దీంతో ఈ క్షేత్రంలో కొలువైన బ్రహ్మ, బ్రహ్మపురీశ్వర శివాలయం ఆశీర్వాదం కోరుతూ పూజిస్తే తమ విధి రాత మారుతుందని భక్తులు నమ్ముతారు. మన జీవితంలో మంచిని తెచ్చే ఆలయంగా బ్రహ్మ దేవుడి ఆలయం ప్రసిధ్ధి చెందింది. ఈ క్షేత్రం విశిష్టత.. తెలుసుకుందాం

పురాణాల ప్రకారం ఈ స్థలానికి ఒక ప్రత్యేక ఉంది.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు.. సృష్టి, స్థితి, లయములకు అధిపతులు..విష్ణు నాభి నుంచి పుట్టిన బ్రహ్మ దేవుడికి ఈ సృష్టికి మూలం తానే అని గర్వపడుతుంటాడు. తాను లేక పొతే విశ్వం లేదని.. సృష్టికర్తను నేనే అంటూ అహంకారం పెంచుకుంటాడు. దీంతో శివుడి కంటే తానే గొప్పవాడినని అనుక్షణం ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మ గర్వం అణచడానికి పరమ శివుడి యొక్క ప్రతిరూపంగా భావించే కాలభైరవుడు బ్రహ్మదేవుడి యొక్క 5 వ తలని ఖండించాడు. అంతేకాదు..బ్రహ్మదేవుడు తన సృష్టి నిర్మాణ శక్తిని కోల్పోవాలని శివుడు శపిస్తాడు. దీంతో బ్రహ్మ దేవుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో శాప విముక్తి కోసం తీర్థయాత్రకు బయలుదేరాడు.

అలా బ్రహ్మదేవుడు తీర్ధయాత్రలు చేస్తూ.. ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని సందర్శించి.. బ్రహ్మపురీశ్వర చుట్టూ 12 శివలింగాలను ఏర్పాటు చేసి శివుడిని పూజించడం ప్రారంభించాడట.. బ్రహ్మ పశ్చాత్తాపాన్ని గ్రహించిన పార్వతీపరమేశ్వరులు బ్రహ్మ దేవుడికి శాప విమోచనం కలిగించి తిరిగి సృష్టి నిర్మాణ శక్తిని ఇచ్చారని పురాణాల కధనం. ఈ బ్రహ్మ పురిలో శివుడి బ్రహ్మపురీశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక బ్రహ్మ పురిలో బ్రహ్మదేవుడికి ఒక ప్రత్యేకమైన ఆలయం కూడా ఉంది. అందుకనే ఆ ఊరిని బ్రహ్మపురి అని పిలుస్తారు.

శివుడు స్వయంగా తనతో పాటు బ్రహ్మను కూడా ఈ ఆలయంలో ప్రత్యేక మందిరం కలిగి ఉంటాడని ఆశీర్వదించాడు. బ్రహ్మ స్వయంగా తన విధిని ఇక్కడ తిరిగి వ్రాసినందున అతను బ్రహ్మకు సలహా ఇచ్చాడని స్థానికుల విశ్వాసం. అంతేకాదు.. ఎవరైనా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి తనను పూజిస్తే.. అలా ఈ ఆలయాన్ని సందర్శించే తన భక్తుల విధిని బ్రహ్మ తిరిగి వ్రాయాలని సూచించాడట..

అప్పటి నుంచి బ్రహ్మ తన తలరాతని తానే మార్చుకున్న ఈ ప్రాంతంలోని అతను ప్రతిష్టించిన 12 శివలింగాలను దర్శించిన భక్తుల తల మారుతుంది అని..దురదృష్టం తొలగి.. మంచి అదృష్టం కలుగుతుంది అని నమ్ముతారు. తమ జీవితంలో తాము అనుకున్నది సాధించలేక పోయినప్పుడు.. దురదృష్టం వెంటాడుతున్నప్పుడు ఈ బ్రహ్మదేవుడి ని దర్శించుకొంటారు.. తమ కష్టాలను తొలగించుకొంటారు. ఇక్క బ్రహ్మ ప్రతిష్టించిన 12 శివలింగాలే కాకుండా ఆలయ ప్రాంగణంలో పతంజలి మహర్షి జీవసమాధి కూడా ఉంది.

శివలింగాలు చాలావరకు ప్రత్యేక మందిరాల్లో ఉన్నాయి, ఇవి బ్రహ్మ తీర్థం చుట్టూ ఉన్నాయి. శివుడికి పూజలు చేయటానికి బ్రహ్మ దేవుడు నీరు తీసుకున్న చెరువుని బ్రహ్మ తీర్థంగా పిలుస్తున్నారు. ఈ తీర్థం దగ్గరే బ్రహ్మ దేవుడు శివుడిని ప్రార్ధించాడని విశ్వసిస్తారు. ఈ తీర్థం ఒక పవిత్రమైన సరస్సు దగ్గర ఉంది, భక్తులు సుదూర ప్రాంతాల నుండి తమ పాపప్రక్షాళన నిమిత్తం ఇక్కడకు వస్తారు.ఈ తీర్థంలో ఒక మునక వేయడం శరీరాన్ని, మనసును కూడా పవిత్రం చేస్తుందని నమ్ముతారు. ప్రతి ఏటా తమ నైతిక పాపాల నుండి పవిత్రులవడానికి వేలాదిమంది భక్తులు ఈ బ్రహ్మ తీర్ధానికి వస్తారు. ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం ఉంటే జీవితంలో ఎటువంటి కష్టాలు అయినా తొలగిపోయి.. మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మకం.. మరి ఇదే ఈ ఆలయం ప్రత్యేత.!!

Also Read: నేటి నుంచి ఐదు రోజుల పాటు హైదరాబాద్ వాసులను అలరించనున్న రకరకాల పువ్వుల, పండ్లజాతి మొక్కలు