Sridevi Younger Daughter Debut: అతిలోక సుందరి బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టి.. హీరోయిన్‌గా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో వందలాది సినిమాల్లో కథానాయికగా నటించింది. అందం, అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే శ్రీదేవి మృతి చెందింది. ఈ అతిలోక సుందరి నట వారసురాలిగా ఇప్పటికే జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. వరస సినిమాలతో బిజీ అయ్యిపోయింది. తన కూతురుని హీరోయిన్‌గా చూడాలి కోరుకున్న శ్రీదేవి ఆ కోరిక తీరకుండానే మరణించింది. అయినా తల్లి కోరికను జాన్వీ తీర్చగా తాజాగా రెండో కూతురు వెండి తెరపై అడుగు పెట్టడానికి రెడీ అవుతుందనే బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది.
తల్లి పోలికలను అందాన్ని పుణికిపుచ్చుకున్న ఈ బ్యూటీ ఖుషీ ఎప్పుడు వెండి తెరపై కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు బోని కపూర్ గుడ్‌న్యూస్ చెప్పారు తాజా గా ఖుషీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్ త్వరలోనే ఖుషీ నటిగా ఆరంగ్రేట్రం చేయనుందని స్పష్టం చేశారు. అయితే ఖుషీని మొదట పరిచయం చేసేది మాత్రం తాను కాదని చెప్పారు. అయితే శ్రీదేవి మరో వారసురాలిని వెండి తెరకు ఎవరు పరిచయం చేస్తున్నారు.. హీరో ఎవరు అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: రోజాతో నాకు విబేధాలు లేవు.. మరో 35ఏళ్ళు జగనే సీఎం అని నారాయణ స్వామి జోస్యం