ఎస్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో నిందితులకు బెయిల్..కానీ ?

| Edited By: Pardhasaradhi Peri

Aug 20, 2020 | 8:32 PM

ఎస్ బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితులు, డీ హెచ్ ఎఫ్ ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ లకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీ లాండరింగ్ కేసులో..

ఎస్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో నిందితులకు బెయిల్..కానీ ?
Follow us on

ఎస్ బ్యాంకు ఫ్రాడ్ కేసులో నిందితులు, డీ హెచ్ ఎఫ్ ఎల్ ప్రమోటర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ లకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీ లాండరింగ్ కేసులో వీరిని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయితే ఇదే కేసులో సీబీఐ  దర్యాప్తు నేపథ్యంలో వీరు జైల్లో ఉండాల్సిందే.. 60 రోజుల వ్యవధిలో ఈడీ చార్జిషీటును దాఖలు చేయలేకపోయినందున జస్టిస్ భారతి డాంగ్రే వీరికి బెయిల్ మంజూరు చేశారు. గత మే నెల 14 న కపిల్ వాధ్వానీ, ధీరజ్ వాధ్వానీలను ఈడీ అరెస్టు చేసింది. సీబీఐ  దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున ఈ నిందితులు ఇప్పట్లో జైలు నుంచి విడుదల కాకపోవచ్ఛునని అంటున్నారు.