కరోనాతో నటుడు దిలీప్‌కుమార్‌ సోదరుడు ఇషాన్‌ఖాన్‌ మృతి

|

Sep 03, 2020 | 8:50 AM

బాలీవుడ్‌ నటుడు దిలీప్‌కుమార్‌ సోదరుడు ఇషాన్‌ఖాన్‌ కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.

కరోనాతో నటుడు దిలీప్‌కుమార్‌ సోదరుడు ఇషాన్‌ఖాన్‌ మృతి
Follow us on

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ధాటికి జనం విలవిలలాడుతోంది. కరోనా రాకాసి కోరలకు చిక్కుకుని ప్రాణాలొదులుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు దిలీప్‌కుమార్‌ సోదరుడు ఇషాన్‌ఖాన్‌ కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఇషాన్‌ఖాన్‌ కరోనాతోపాటు గుండెజబ్బు, అల్జీమర్స్‌తో కూడా బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. మరో సోదరుడు అస్లామ్‌ఖాన్‌(90) కూడా అనారోగ్యం కారణంగా గత ఆగస్టు 21న మృతి చెందిన విషయం తెలిసిందే.