పేలిన బాయిలర్ .. ఇద్దరు మృతి

శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో ఈ ఉదయం బాయిలర్ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పైడిభీమవరంలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఉదయం మొదటి షిఫ్టు కార్మికులు పనిలో ఉండగా ఒక్కసారిగ బాయిలర్ పేలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. చనిపోయిన ఇద్దరూ రాహుల్, రాజారావుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని […]

పేలిన బాయిలర్ .. ఇద్దరు మృతి

Updated on: Aug 11, 2019 | 2:03 PM

శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో ఈ ఉదయం బాయిలర్ పేలిన ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పైడిభీమవరంలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఉదయం మొదటి షిఫ్టు కార్మికులు పనిలో ఉండగా ఒక్కసారిగ బాయిలర్ పేలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. చనిపోయిన ఇద్దరూ రాహుల్, రాజారావుగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us