రాజస్తాన్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. చంబల్ నదిలో పడవ బోల్తాపడి 10 మంది గల్లంతైయ్యారు. కోటా జిల్లాలోని ఇటావా పట్టణానికి సమీపంలోని ఖతోలీ ప్రాతంలో చంబల్ నదిని దాటుతున్న ఒక పడవ నీట మునిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మంది ప్రయాణీకులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ పడవలో 14 బైక్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారు. నీటి మునిగిన బాధితులను ఒడ్డుకు తీసుకువచ్చే ప్రయత్నిస్తున్నారు. 40 మంది క్షేమంగా దరికి చేర్చినప్పటికీ 10 మంది జాడ కనిపించడంలేదని స్థానికులు తెలిపారు. జరిగిన ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రత్యేక సహాయక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, స్థానిక మీడియా కథనం ప్రకారం, గోఠలా కాలా సమీపంలోని కమలేశ్వర్ ఆలయానికి వెళుతున్న పడవ చంబల్ నదిలో బోల్తా పడింది. పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించిన కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Boat capsizes in Chambal River in Madhya Pradesh. Around 25 were on the boat, 14 bodies fished out.
Victims were from Karauli in #Rajasthan to Goraya Baba temple in MP. @fpjindia #accident pic.twitter.com/rIlDYX7FfT
— Ajay Sharma (@AjaySha22728399) September 16, 2020