70 ఏళ్ళు దాటితే.. ఇంటి ద‌గ్గ‌రే క‌రోనా టెస్టులు..

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న‌ది. ఈ క్రమంలో వృద్దులకు ఇంటివద్దే కరోనా పరీక్షలు

70 ఏళ్ళు దాటితే.. ఇంటి ద‌గ్గ‌రే క‌రోనా టెస్టులు..

Edited By:

Updated on: Jun 24, 2020 | 9:17 PM

Brihanmumbai Municipal Corporation: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న‌ది. ఈ క్రమంలో వృద్దులకు ఇంటివద్దే కరోనా పరీక్షలు నిర్వహించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. దీనికోసం సుమారు లక్ష క‌రోనా టెస్టు కిట్లను కేటాయించారు. వీటి ద్వారా చేసిన కరోనా పరీక్షల‌ ఫలితాలు అరగంటలోనే వస్తాయి.

మిషన్ యూనివర్సల్ టెస్టింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 70 ఏళ్ళు దాటిన వృద్ధులు డాక్టర్ ప్రిస్కిప్షన్ కూడా లేకుండా ఇంటి వద్దే కరోనా టెస్టులు చేయించుకోవచ్చని చెప్పారు. అలాగే 35 ప్ర‌ధాన‌ ప్రైవేటు ఆస్పత్రులను కూడా కొవిడ్-19 యాంటీజెన్ కిట్లు ఉపయోగించాల్సిందిగా కోరినట్లు సమాచారం.