Blue Rice: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బ్లూరైస్’… ఎలా రెడీ చేయాలో తెలుసా ?
భారత్‌లో పలు రాష్ట్రాలలో స్పెషల్ ఫుడ్స్ ఉంటాయి. ఉదాహారణకు నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చపాతీలు తింటుంటారు. అలాగే సౌత్ ఇండియన్స్ అన్నం, సాంబార్ తినడానికి ఇష్టపడుతుంటారు.
Blue Rise: భారత్‌లో పలు రాష్ట్రాలలో స్పెషల్ ఫుడ్స్ ఉంటాయి. ఉదాహారణకు నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చపాతీలు తింటుంటారు. అలాగే సౌత్ ఇండియన్స్ అన్నం, సాంబార్ తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఏదైనా డిఫరెంట్ వంటకాలు చేసినప్పుడు ఇక అవి నెట్టింట్లో ఎంత వైరల్ అవుతాయో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా బ్లూరైస్ సోషల్ మీడియాల్ వైరల్ అవుతోంది.
దేశంలో తెల్లని బియ్యం తర్వాత స్థానంలో ఉన్నది బ్లూరైస్. ఇప్పటికే ఈ రైస్.. మలేషియా, థాయ్‌లాండ్ దేశాలలో ప్రాచుర్యాన్ని పొందింది. ఆసియా దేశాలలో నాసి కేరాబు అని ఈ రైస్‌ను అంటుంటారు. ఇక భారత్‌లో బ్లూరైస్గా పిలుస్తుంటాం. అసలు ఈ బ్లూరైస్ ఏలా తయరువుతుందో తెలుసుకుందామా..
ముందుగా ఒక కప్పు జాస్మిన్ రైస్ తీసుకుని వైట్ రైస్ వండినట్లే వండాలి. ఆ తర్వాత నీటిలో ఒక గుప్పెడు బటర్ ఫ్లై పీ (అపరాజీత) పువ్వులు కలపండి. రైస్‌కు మరీ ఎక్కువ బ్లూ కలర్ కావాలంటే చాలా పువ్వులు తీసుకోవాలి. అంతే బ్లూరైస్ రెడీ అయిపోతుంది. ఈ రైస్‌ను మీకు నచ్చిన కర్రీస్‌తో తినవచ్చు. ఇక రైస్ ఫ్రాగ్రంట్ రైస్ కనుక ఏసియన్ ఫ్లేవర్స్ దీనికి కరెక్ట్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఇక రైస్‌లో వాడే బటర్ ఫ్లై పీ పువ్వులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ .. శరీరాన్ని డీటాక్సిఫై చేసి కాంతివంతంగా ఉండేలా చేస్తాయట.
Also Read:
Benefits Of Curry leaves: కరివేపాకు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
Health benefits of spinach: బ్రెస్ట్ క్యాన్సర్‌ను పాలకూర అదుపు చేస్తుందా ? పోషకాహార నిధిగా ..