వివాదాస్పదమైన గాల్వన్ నది ప్రాంతంలో 16 చైనా శిబిరాలు ఉన్నట్టు ‘ప్లానెట్ ల్యాబ్స్’ తీసిన ఇమేజీలు చూపుతున్నాయి. వాటిపై నల్లటి టార్పాలిన్లు కూడా కప్పి ఉన్నట్టు గుర్తించారు. అంటే ఆ ప్రాంతం నుంచి చైనా సేనలు వెనక్కి వెళ్లలేదన్న విషయం, స్పష్టమవుతోంది. ఈ నెల 25, 26 తేదీల్లో ప్లానెట్ ల్యాబ్స్ ఈ ఇమేజీలను తీసింది. అయితే ఆ ప్రాంతంలో భారత సైనిక క్యాంపులేవీ కనబడలేదు. కాగా ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు అందవలసి ఉంది.