Sujana Chowdary : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం, ఎంపీకి ప్రముఖుల పరామర్శ

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకుంది. ఆయన తండ్రి యలమంచిలి జనార్ధనరావు(88) అనారోగ్య కారణాలతో శనివారం తుదిశ్వాస విడిచారు. 

Sujana Chowdary : బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం, ఎంపీకి ప్రముఖుల పరామర్శ
Follow us

|

Updated on: Dec 05, 2020 | 8:50 AM

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకుంది. ఆయన తండ్రి యలమంచిలి జనార్ధనరావు(88) అనారోగ్య కారణాలతో శనివారం తుదిశ్వాస విడిచారు.  కృష్ణా జిల్లా దోసపాడులో 1932 జనవరి 9న జన్మించిన జనార్ధనరావు కోయంబత్తూరులోని పిఎస్జీ కళాశాల నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. అనంతరం 1955లో సాగునీటిశాఖలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. ఏపీలోని పలు సాగు, తాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించారు. ప్రధానంగా నాగార్జునసాగర్,శ్రీరామ్ సాగర్, ప్రకాశం బ్యారేజి, కోయల్ సాగర్ గేట్ల నిర్మాణంలోనూ, వాటిని అమర్చడంలోను ముఖ్య భూమిక పోషించారు.

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేయడంలో నాటి ఏపీ గవర్నమెంట్ జనార్ధనరావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం తరపున ప్రత్యేక శిక్షణకు పలు యూరప్ దేశాలకు ఆయనను పంపించారు. ఇంజనీరింగ్ విభాగంలో అద్భుతమైన సేవలు అందించినందుకు జనార్ధనరావుకు పలు అవార్డులు లభించాయి.

2

జనార్ధనరావుకు భార్య సుశీల, నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. బీజేపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సుజనా చౌదరి జనార్ధనరావు చిన్నకుమారుడు. జనార్ధనరావు అంత్యక్రియలు జూబ్లీహిల్స్ విస్పర్ వ్యాలీలోని వైకుంఠ మహాప్రస్థానంలో ఉదయం 11.45 నిముషాలకు జరగనున్నట్టు ప్యామిలీ మెంబర్స్ తెలిపారు.

Also Read :Concussion Substitute : కంకషన్​ సబ్​స్టిట్యూట్​ అంటే ఏంటి? దాని కోసం రూపొందించిన నియమాలు ఏంటి?

Latest Articles