దేశవ్యాప్తంగా కాషాయం జెండా ఎగరడమే లక్ష్యం.. త్వరలో జేపీ నడ్డా భారత్ యాత్ర

దేశవ్యాప్తంగా కాషాయం జెండా ఎగరడమే లక్ష్యం.. త్వరలో జేపీ నడ్డా భారత్ యాత్ర

భారతీయ జనతాపార్టీ దేశ వ్యాప్తంగా విజయాల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు రాష్ట్రాల్లోనూ సత్తా చాటిన కమలనాథులు మిగిలిన రాష్ట్రాల్లోనూ కషాయం జెండా ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు

Balaraju Goud

|

Nov 14, 2020 | 5:44 PM

భారతీయ జనతాపార్టీ దేశ వ్యాప్తంగా విజయాల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు రాష్ట్రాల్లోనూ సత్తా చాటిన కమలనాథులు మిగిలిన రాష్ట్రాల్లోనూ కషాయం జెండా ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన బీజేపీ అదే ఊపులో దేశ పర్యటనకు రెఢీ అవుతున్నారు కమలదళపతి జయప్రకాష్ నడ్డా.

దేశవ్యాప్తంగా విజయాల పరంపర కొనసాగుతున్నా… ‘దీర్ఘ దృష్టి’ తో మరిన్ని వ్యూహాలను రచిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశవ్యాప్తంగా ఓ యాత్రకు సిద్దమవుతున్నారు. ‘రాష్ట్రీయ విస్తృత్ ప్రవాస్’ పేరుతో 100 రోజుల పాటు యాత్రను చేపట్టాలని నిర్ణయించారు. ఏయే రాష్ట్రంలో ఎన్ని రోజులు పర్యటించాలన్నది కూడా ఇప్పటికే స్కెచ్ వేసినట్లు సమాచారం. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాభవం పొందిన రాష్ట్రాలు, నియోజకవర్గాల గుండా ఈ యాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ యాత్రలో భాగంగా నడ్డా.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న శాసన సభ్యులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, తదితరులతో సమావేశమవుతారు.

తన పర్యటనలో పార్టీ పటిష్ఠత, విస్తరణ, పొత్తులు, ఎక్కువ సీట్లు గెలుపే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుంది. పార్టీ విస్తరణ ఎలా చేయాలన్న దానిపై ఆయన శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారని పార్టీ నేతలు అంటున్నారు. అయితే దేశవ్యాప్తంగా కోవిడ్ ప్రభావం ఉంది కాబట్టి… యాత్ర సందర్భంగా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. నడ్డా సమావేశమయ్యే హాలులో 200 మంది కంటే ఎక్కువగా ఉండకుండా స్థానిక పార్టీలు బాధ్యత వహించనున్నాయి. శాలువాలు, బోకేలు ఇచ్చే సంప్రదయానికి ప్రస్తుతానికి స్వస్తి పలికనున్నారు.

అధికారంలో లేని రాష్ట్రాలపైనే ఎక్కువ ఫోకస్ చేసిన బీజేపీ ముఖ్యంగా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పాండిచేరి, తమిళనాడు రాష్ట్రాలపై పకడ్బందీ ప్రణాళికను రూపొందించింది బీజేపీ. అయితే ‘సీ’ కేటగిరీ కింద వచ్చే రాష్ట్రాల్లో మాత్రం నడ్డా రెండు రోజుల పాటు బస చేయనున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu