ఇంగ్లాండ్‌లో కత్తిపోట్ల కలకలం.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

| Edited By:

Sep 06, 2020 | 6:46 PM

ఇంగ్లాండ్‌లో కత్తిపోట్లు కలకలం రేపాయి. బర్మింగ్‌హామ్‌ సిటీ సెంటర్‌ ప్రాంతంలో కొందరు దుండగులు స్థానికులపై వరుసగా కత్తిపోట్లకు పాల్పడ్డారు

ఇంగ్లాండ్‌లో కత్తిపోట్ల కలకలం.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు
Follow us on

Birmingham stabbings News: ఇంగ్లాండ్‌లో కత్తిపోట్లు కలకలం రేపాయి. బర్మింగ్‌హామ్‌ సిటీ సెంటర్‌ ప్రాంతంలో కొందరు దుండగులు స్థానికులపై వరుసగా కత్తిపోట్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఎంతమందికి ప్రాణాపాయం ఉందనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. అయితే ఇది అతి పెద్ద ఘటనగా బర్మాంగ్‌హామ్ పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. సమీపంలోని రోడ్లను మూసేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. మరోవైపు ఈ దాడులు ఎందుకు జరిగాయన్న విషయంపై కారణాలను కనుగొనే పనిలో వైద్యులు పడ్డారు.

Read More:

కరోనాకు ఎక్కడైనా చికిత్స ఒకటే: మంత్రి ఈటెల

పూజా హెగ్డే ‘నో’ చెప్తే.. లైన్‌లో రకుల్‌!