Bird Flu in India: మెదక్‌లో బర్డ్ ఫ్లూ కలవరం.. ఐదు నెమళ్లు మృత్యువాత.. స్థానికుల్లో టెన్షన్, టెన్షన్

| Edited By: Pardhasaradhi Peri

Jan 09, 2021 | 6:15 PM

కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వేళ ఇప్పుడు బర్డ్ ప్లూ టెన్షన్ పట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే బర్డ్ ప్లూ ఆరు రాష్ట్రాలకు విస్తరించిందని..

Bird Flu in India: మెదక్‌లో బర్డ్ ఫ్లూ కలవరం.. ఐదు నెమళ్లు మృత్యువాత.. స్థానికుల్లో టెన్షన్, టెన్షన్
Follow us on

Bird Flu in India: కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వేళ ఇప్పుడు బర్డ్ ప్లూ టెన్షన్ పట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే బర్డ్ ప్లూ ఆరు రాష్ట్రాలకు విస్తరించిందని.. మిగిలిన రాష్ట్రాలు కూడా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కోళ్లు, పక్షులు మృతి చెందడం కలకలం రేపుతోంది. బర్డ్ ప్లూ కారణంగానే అవి చనిపోయి ఉండొచ్చని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా  తెలంగాణలో కూడా ఈ ఫ్లూ కలవరపాటుకు గురి చేస్తోంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల పక్షులు, కోళ్లు మృత్యువాతపడుతున్నాయి.

మెదక్‌ జిల్లా పాపన్నపేట సమీప అటవీ ప్రాంతంలో ఐదు నెమళ్లు చనిపోయాయి. కుళ్లిన స్థితిలో ఉన్న వాటి మృతకళేబరాలు అటుగా వెళ్లిన పశువుల కాపరి గుర్తించి.. స్థానికులకు తెలియజేశాడు. దీంతో జనాల్లో బర్డ్ ప్లూ టెన్షన్ మొదలైంది.  స్థానిక పశు సంవర్థక అధికారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా అవి అజీర్ణంతో చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర గుట్ట ప్రాంతంలో చనిపోయి.. కుళ్లిన స్థితిలో ఉన్న నెమళ్లను గుర్తించిన పశువుల కాపరి.. ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం వాటి నమూనాలు సేకరించి.. టెస్టులు చేసే పనిలో ఉన్నారు. కాగా వలస పక్షల కారణంగా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

Also Read :

COVID Vaccine: గుడ్ న్యూస్.. దేశంలో జనవరి 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ.. స్పష్టం చేసిన ప్రధాని మోదీ

Sheep Distribution: గొల్ల, కురుమలకు గుడ్ న్యూస్.. మొదటి విడత గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని సీఎం ఆదేశం

Today Gold and Silver Price: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..తాజా రేట్లు ఇలా ఉన్నాయి