Bird Flu In Maharashtra: మరో రాష్ట్రంలోకి అడుగు పెట్టిన బర్డ్ ఫ్లూ.. 9వేల కోళ్లను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు

|

Jan 11, 2021 | 11:14 AM

దేశంలో ఓ వైపు కరోనా కల్లోలం సృష్టిస్తుంటే.. మరోవైపు బర్డ్ ఫ్లూ భయాందోళనలను కలిగిస్తుంది. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో ఈ వైరస్ ఉందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ సహా...

Bird Flu In Maharashtra: మరో రాష్ట్రంలోకి అడుగు పెట్టిన బర్డ్ ఫ్లూ.. 9వేల కోళ్లను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు
Follow us on

Bird Flu In Maharashtra: దేశంలో ఓ వైపు కరోనా కల్లోలం సృష్టిస్తుంటే.. మరోవైపు బర్డ్ ఫ్లూ భయాందోళనలను కలిగిస్తుంది. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో ఈ వైరస్ ఉందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ సహా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది పక్షులు మృత్యువాతపడుతున్నాయి. తాజాగా బర్డ్ బాధిత రాష్ట్రంలో మరోరాష్ట్రం చేరింది. మహారాష్ట్రలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. పర్భణీ జిల్లాలోని మురుంబా గ్రామంలో గత రెండో రోజుల నుంచి 800లకు పైగా కోళ్లు మృతి చెందాయి. వీటి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించామని జిల్లా కలెక్టర్ దీపక్ మధుకర్ తెలిపారు. ఏవియన్ ఇన్ ఫ్లూయంజా వైరస్ తోనే కోళ్లు మృతి చెందాయని అందులో తేలిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్న ఉన్న 8 పౌల్ట్రీఫామ్ ల్లో ఉన్న మొత్తం 9 వేల కోళ్లను చంపేయాలి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

దేశంలో రోజుకో వైరస్ వ్యాప్తిస్తుంది. ఇప్పటికే కోవిడ్ యుకె లోని స్ట్రెయిట్ లతో పాటు తాజాగా బర్డ్ ఫ్లూ లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హరియానా, గుజరాత్‌లలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌లలో మృతి చెందిన కోళ్ల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. వాటి రిపోర్టు ఇంకా రావాల్సివుంది.’

Also Read: టాలీవుడ్ డైరెక్టర్ లెక్కల మాస్టర్ సుకుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువ..