Viral Vidoe: ప్రియా పెట్రోల్ రేట్లు పెరిగిన‌య్‌.. నిన్నెట్లా క‌లిసేది.? ట్రెండ్ అవుతున్న బీహారీ పాట..

|

Apr 19, 2022 | 9:47 AM

సోషల్‌ మీడియా సామాన్యులనుంచి పారిశ్రామిక వేత్తల వరకూ ఎంతగానో ఉపయోగపడుతోంది. వ్యాపారవేత్తలు వ్యాపార లావాదేవీలు జరుపుకుంటే.. సామాన్యులు తమ కష్టాలను ఇలా సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా..


సోషల్‌ మీడియా సామాన్యులనుంచి పారిశ్రామిక వేత్తల వరకూ ఎంతగానో ఉపయోగపడుతోంది. వ్యాపారవేత్తలు వ్యాపార లావాదేవీలు జరుపుకుంటే.. సామాన్యులు తమ కష్టాలను ఇలా సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా ఓ సామాన్యుడు పెట్రోలు ధర పెరిగిపోవడంతో తన ప్రియురాలిని కలుసుకోలేక తన బాధను పాట రూపంలో వెల్లడించాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అసలు విషయానికి వస్తే.. గ‌డిచిన ప‌దిహేను రోజుల‌నుంచి పెట్రో రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివ‌ర‌కూ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర 120 రూపాయలు దాటింది. సామాన్యులు పెట్రోల్ కొట్టించుకోలేని ప‌రిస్థితికి వెళ్లిపోయారు. దీంతో త‌మ క‌ష్టాల‌పై నెట్టింట జోకులేసుకుంటున్నారు. ఫ‌న్నీ మీమ్స్ రూపంలో పెట్రోల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై త‌మ నిర‌స‌న తెలుపుతున్నారు. కాగా, పెట్రోల్ ధ‌ర‌ల పెంపుపై ఓ బీహారీ యువ‌కుడు పాడిన పాట నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ పాట‌కు ‘పెట్రోల్ స‌జ్నీ’ అని పేరు పెట్టారు.బీహార్‌కు చెందిన విశ్వజీత్ అనే యువ‌కుడు ఈ పాటను పాడాడు. “కైసే మైలే ఆవు తోరా సే తు బోలా సజ్నీ, హోలో మెహెంగా ధేర్ అబ్ తా పెట్రోల్ సజ్నీ” ( ప్రియా పెట్రోల్ రేట్లు పెరిగిన‌య్..ఇక నిన్ను ఎట్లా క‌లిసేది.. నీ ద‌రికి ఎలా చేరేది ) అంటూ పాటందుకున్నాడు. ఈ పాటను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను వీక్షిస్తున్న లక్షలమంది నెటిజన్లు లైక్‌ చేస్తూ..తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్‌.. వైరల్ వీడియో

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Follow us on