Bigg Boss4 : ఎవిక్ష‌న్ పాస్ వల్ల బయటపడిన అవినాష్ … ప్రేక్ష‌కులు న‌న్ను ఎలిమినేట్ చేశారంటూ బాదపడ్డ కంటెస్టెంట్

|

Nov 30, 2020 | 11:02 AM

బిగ్ బాస్4 12 వారం హౌస్ నుంచి ఎవరకు బయటకు వెళ్తారన్నది ఆసక్తిగా మారింది. నామినేష‌న్‌లో చివ‌ర‌కు హౌస్ లో మంచి ఫ్రెండ్స్ గా ఉన్న అరియానా, అవినాష్ మిగిలారు.ఈ ఇద్దరిలో ఒక్కరు ఎలిమినేటి అవుతారని  చెప్పడంతో ఎవ్వరు ఎలిమినేట్ అవుతారా అని అందరిలో టెన్షన్ మొదలైంది. ఎవిక్ష‌న్ పాస్ ఉండడంతో ఈ సారి ఎలిమినేషన్ నుంచి అవినాష్ బయటపడొచ్చని నాగార్జున చెప్పారు. దాంతో అరియనా వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువ కనిపించాయి. అయితే ఈ పాస్‌ని వ‌చ్చే […]

Bigg Boss4 : ఎవిక్ష‌న్ పాస్ వల్ల బయటపడిన అవినాష్ ... ప్రేక్ష‌కులు న‌న్ను ఎలిమినేట్ చేశారంటూ బాదపడ్డ కంటెస్టెంట్
Follow us on

బిగ్ బాస్4 12 వారం హౌస్ నుంచి ఎవరకు బయటకు వెళ్తారన్నది ఆసక్తిగా మారింది. నామినేష‌న్‌లో చివ‌ర‌కు హౌస్ లో మంచి ఫ్రెండ్స్ గా ఉన్న అరియానా, అవినాష్ మిగిలారు.ఈ ఇద్దరిలో ఒక్కరు ఎలిమినేటి అవుతారని  చెప్పడంతో ఎవ్వరు ఎలిమినేట్ అవుతారా అని అందరిలో టెన్షన్ మొదలైంది. ఎవిక్ష‌న్ పాస్ ఉండడంతో ఈ సారి ఎలిమినేషన్ నుంచి అవినాష్ బయటపడొచ్చని నాగార్జున చెప్పారు. దాంతో అరియనా వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువ కనిపించాయి. అయితే ఈ పాస్‌ని వ‌చ్చే వారం అయిన ఉప‌యోగించుకోవ‌చ్చు లేదంటే నువ్వు సేవ్ అయితావ‌నే న‌మ్మ‌కం ఉంటే అరియానాకి కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు అని నాగ్ చెప్పాడు .అయితే అవినాష్ పాస్ ను నేనే వాడుకుంటే అని సమాధానం ఇచ్చాడు.

నా సిక్స్త్ సెన్స్ ప్రకారం నేను ఎలిమినేట్ అవుతాన‌ని అనిపిస్తుంది. కాబట్టి ఈ ఎవిక్ష‌న్ పాస్ నేనే వాడ‌తాను అని అవినాష్ చెప్పడంతో హౌస్ మేట్స్  సలహా కూడా తీసుకో.  ఒక్కసారి అరియనా తో కూడా మాట్లాడు అని నాగ్ చెప్పడంతో మిగిలిన సభ్యుల సలహా తీసుకున్నాడు అవినాష్. అందరు అవినాష్ పాస్ వాడుకోవాలని సూచించడంతో ఎవిక్ష‌న్ పాస్ తానే వాడుకున్నాడు. ఇక టీపీల‌లో ఎవ‌రి చేతికి రెడ్ క‌ల‌ర్ అంటుతుందో వారి ఎలిమినేట్ అవుతారు, గ్రీన్ క‌లర్ వ‌చ్చిన వారు సేవ్ అవుతారు అని నాగ్ పేర్కొన్నాడు.  అయితే అవినాష్ కు రెడ్ కలర్ వచ్చింది. అరియనకు గ్రీన్ కలర్ వచ్చింది. దాంతో అరియనా సేవ్ అయ్యింది. ఇక పాస్ ఉండటంతో ఈ వారం ఎలినేషన్ నుంచి అవినాష్ బయటపడ్డాడు. ఇక తాను తీసుకున్న నిర్ణయం మంచిదైందని పాస్ తన దగ్గర ఉండటంతో  అవినాష్ బయటపడ్డాడని నాగ్ తెలిపాడు. దాంతో ఈ వారం ఎలిమినేషన్ జరగలేదు. అయితే ఎవిక్ష‌న్ పాస్ వ‌ల‌ననే నేను సేవ్ అయ్యాను..ప్రేక్ష‌కులు న‌న్ను ఎలిమినేట్ చేశారంటూ తెగ బాధపడ్డాడు అవినాష్‌. ఎవిక్ష‌న్ పాస్ ఉంద‌నే ప్రేక్ష‌కులు నీకు త‌క్కువ ఓట్లు వేసి ఉండొచ్చు.  ఈ సారి నామినేష‌న్‌లోలేని వారి క‌న్నా నువ్వు స్ట్రాంగ్ అయి ఉండొచ్చు అంటూ అవినాష్‌కు నాగార్జున దైర్యం చెప్పారు. ఏదేమైనా ఈ వారం ఎలిమినేషన్ డ్రామా రసవత్తరంగా సాగిందనే చెప్పాలి .