బిగ్ బాస్ సీజన్ 4 చివరిదశకు చేరుకుంది. ఈ క్రమంలో పరిణామాలు ఉత్కంఠ భరితంగా మారాయి. మరో రెండు వారాల్లో విజేత ఎవరో తేలనుంది. తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను ఎలాగైనా గెలిపించుకోవాలన్న ఉత్సాహంతో ఆర్మీలు, అభిమానులు ఓట్ల ప్రచారం ఉధృతం చేశారు. అయితే ఎక్కువమంది ఈసారి అభిజీత్ విన్నర్ అవుతాడని జోస్యం చెబుతున్నారు. కానీ అది బిగ్ బాస్ హౌస్. ఏమైనా జరగవచ్చు. అయితే ఈ సారి బిగ్ బాస్ విజేతగా మహిళను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈసారి వీక్షకులు మనోభావాలను షో నిర్వాహకులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది. ఆట కాస్త స్పైసీగా ఉండటానికి..కాస్త గ్లామర్ ఉండేలా చూసుకుని ఎలిమినేషన్ ప్రక్రియ జరిగిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రమంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరనేది కూడా వారు ఫిక్స్ చేశారని పలువురు చెబుతున్నారు. ఇప్పటివరకు ఒక్క సారి కూడా మహిళకు బిగ్ బాస్ టైటిల్ ఇవ్వలేదు. ఆ విషయంలో కాస్త విమర్శలు ఉన్నాయి. ప్రముఖంగా మహిళా సంఘాలు బిగ్ బాస్ షో ప్రారంభమైనప్పటి నుంచి..దాన్ని ఆపివేయాలని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి విజేతగా మహిళను ప్రకటించి వారిని కాస్త చల్లబరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఎందుకంటే ఆటలో మహిళలు తక్కువ కాదు అనే ఉద్దేశాన్ని సందేశంగా పంపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వారు మానసికంగా స్ట్రాంగ్ అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. ఈ క్రమంలో అభిజీత్ అభిమానుల ఆశలు గల్లంతయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజా ప్రాతిపదికను గమనిస్తే అరియానా లేదా మోనాల్..ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగమ్మాయి కాబట్టి అరియానాను పరిగణలోకి తీసుకుంటున్నారట. లెట్స్ వెయిట్ అండ్ సీ.
Also Read : ఆ కుటుంబం అధికారంలో ఉంటే..వర్షాలు పుష్కలం..వైఎస్సార్, జగన్‌లపై ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు