బిగ్‌బాస్ తెలుగు సీజన్ డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. దీంతో బిగ్‌బాస్ బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా పిలుస్తూ వారి వంద రోజుల ప్రయాణాన్ని చూపిస్తున్నాడు. అఖిల్, అభిజిత్ బిగ్ బాస్ జర్నీని చూపించారు. ఆ సందర్భంగా వారి ప్రయాణాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం వారి భావాల్ని వ్యక్త పరిచారు. అయితే అఖిల్ తాను బిగ్‌బాస్ సీజన్ 4 విన్నర్ కాబోతున్నానని అన్నాడు. ఇంకా అతడు ఏం మాట్లాడాడంటే….
ముందుగా అఖిల్‌ను పిలిచి అతడి జర్నీ వీడియో ప్లే చేశారు. అందులో మోనాల్‌తో అఖిల్ ఆటపాటలు, అభితో గొడవలు, సోహైల్ త్యాగాలు అన్నీ చూపించారు.దీంతో అఖిల్ కంటతడి పెట్టుకున్నాడు. తను ఎఫర్ట్స్ పెట్టి ఆడానని స్పష్టం చేశాడు. గెలుపోటములు తన చేతిలో లేవని, కానీ ప్రయత్నం మాత్రం ఎప్పటికీ మానుకోలేదని చెప్పాడు. తోడు కోసం పరితపించాను కానీ ప్రేక్షకుల ఓట్ల రూపంలో అంత ప్రేమ వచ్చినప్పుడు ఇంకా ప్రేమ కావాలనుకోవడం ఫూలిష్‌నెస్ అనిపిస్తోందన్నాడు.
తనకీ ప్రేక్షకుల ప్రేమ చాలు అంటూ మోకాళ్లపై మోకరిల్లి ఓట్లేసిన వారికి ధన్యవాదాలు తెలిపాడు. బిగ్‌బాస్ వల్ల తనేంటో తనకు తెలిసిందని, తప్పకుండా విన్నర్ అవుతానన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అనంతరం బాల్కనీలో ఉన్న తన ఫొటోను తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు.