Bigg Boss 4 : తొలి ఫైనలిస్ట్‌ను అనౌన్స్ చేసిన నాగార్జున.. అరియానాను ముద్దాడిన సోహెల్

|

Dec 13, 2020 | 7:49 AM

బిగ్ బాస్ సీజన్ 4 ముగియడానికి ఇంకో వారం మాత్రమే ఉంది. ఉన్నది ఒక్క వారమే అయినా కూడా మళ్లీ ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టేలా టాస్క్ పెట్టాడు నాగార్జున.

Bigg Boss 4 : తొలి ఫైనలిస్ట్‌ను అనౌన్స్ చేసిన నాగార్జున.. అరియానాను ముద్దాడిన సోహెల్
Follow us on

బిగ్ బాస్ సీజన్ 4 ముగియడానికి ఇంకో వారం మాత్రమే ఉంది. ఉన్నది ఒక్క వారమే అయినా కూడా మళ్లీ ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టేలా టాస్క్ పెట్టాడు నాగార్జున. ఇంటి సభ్యులందరూ కూడా మిగతా వారి గురించి ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్ గురించి చెప్పాలని టాస్క్ ఇచ్చాడు నాగ్. వాళ్ల ముందు ఒక బోర్డు ఉంచి దానిపై ఒక్కో ఇంటి సభ్యుడు తమకు నచ్చిన వారు ముగ్గురు, నచ్చని వారు ఇద్దరు ఇంటి సభ్యుల ఫొటోలు పెట్టమన్నారు. ముందుగా హారిక నచ్చినవారు అఖిల్, అభిజీత్, మోనల్.. నచ్చనివారు అరియానా, సోహెల్ అని చెప్పింది.

అలాగే అఖిల్ నచ్చినవారు హారిక, మోనల్, సోహెల్.. నచ్చనివారు అరియానా, అభిజిత్ అని తెలిపాడు. ఇక అభిజిత్ నచ్చినవారు అరియానా, సోహెల్, హారిక.. నచ్చనివారు మోనల్, అఖిల్ అని అన్నాడు. మోనల్ నచ్చినవారు అఖిల్, హారిక, సోహెల్.. నచ్చనివారు అభిజీత్, అరియానా అదేవిధంగా అరియానా  నచ్చినవారు అభిజీత్, హారిక, మోనల్.. నచ్చనివారు సోహెల్, అఖిల్ అని తెలిపింది. చివరగా సోహెల్  నచ్చినవారు అఖిల్, అభిజీత్, మోనల్.. నచ్చనివారు హారిక, అరియానా అని చెప్పాడు.

బిగ్ బాస్ ఫినాలేలో అడుగుపెట్టే ఐదుగురు ఫైనలిస్టుల్లో ఒక ఫైనలిస్టును శనివారం ప్రకటించారు నాగార్జున. సింగరేణి ముద్దుబిడ్డ సోహెల్ ఫినాలేలో అడుగు పెట్టాడు. స్టోర్ రూంలో ఉన్న బోర్డును అఖిల్‌ను తీసుకురమ్మని చెప్పారు నాగార్జున. ఆ బోర్డు ఎరుపు రంగు క్లాత్‌తో మూసి ఉంది. ఇంటి సభ్యులతోనే కౌంట్ డౌన్ లెక్కపెట్టించి అఖిల్‌తో ఆ రెడ్ క్లాత్ తీసి తొలి ఫైనలిస్ట్‌ను రివీల్ చేశారు.అంతకు ముందు బోర్డు పైన ఎవరి ఫోటో ఉందో గెస్ చేయమని అఖిల్ కు చెప్పాడు నాగార్జున. దానికి అఖిల్ సోహెల్ కానీ మోనాల్ కానీ అని అన్నాడు. అతడి గెస్ కరెక్ట్ అయ్యింది. తనను తొలి ఫైనలిస్ట్ గా ప్రకటించడంతో సోహెల్ చాలా సంతోషం వ్యక్తం చేశాడు. అందరికి హగ్ ఇచ్చి న సోహెల్ అరియనాను ముద్దాడాడు.