తీవ్ర అస్వస్థత పాలైన హిమాంశి ఖురానా

కోవిడ్ పాజిటివ్ కి గురైన బిగ్ బాస్-13 మాజీ కంటెస్టెంట్ హిమాంశి ఖురానా తీవ్ర అస్వస్థత పాలైనట్టు తెలుస్తోంది. ఆమెను అంబులెన్స్ లో చండీగఢ్ నుంచి లూధియానాకు తరలించారు. అధిక జ్వరంతో బాటు ఆక్సిజన్ స్థాయి కూడా తక్కువ కావడంతో..

తీవ్ర అస్వస్థత పాలైన హిమాంశి ఖురానా

Edited By:

Updated on: Oct 01, 2020 | 7:29 PM

కోవిడ్ పాజిటివ్ కి గురైన బిగ్ బాస్-13 మాజీ కంటెస్టెంట్ హిమాంశి ఖురానా తీవ్ర అస్వస్థత పాలైనట్టు తెలుస్తోంది. ఆమెను అంబులెన్స్ లో చండీగఢ్ నుంచి లూధియానాకు తరలించారు. అధిక జ్వరంతో బాటు ఆక్సిజన్ స్థాయి కూడా తక్కువ కావడంతో ఆమెను ఆగమేఘాలపై ఆసుపత్రిలో చేర్చారు. కొంతకాలంగా హోం క్వారంటైన్ లో ఉన్న హిమాంశి..అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. తన ఆరోగ్య పరిస్థితిపై ఈమె ఈ మధ్యే ట్విటర్ ద్వారా తన అభిమానులకు తెలియజేసింది. రైతు బిల్లులకు నిరసనగా ఆ మధ్య ముంబైలో జరిగిన ప్రదర్శనల్లో  హిమాంశి పాల్గొంది. బిగ్ బాస్-13 షో లో ఈమె తన సహ కంటెస్టెంట్ ఆసిమ్ రియాజ్ తో కలిసి పలు మ్యూజిక్ ఆల్బంలు చేసింది.