స్టార్ మా ఛానల్ లో ఈ నెల 21 నుంచి ప్రసారం కానున్న ‘ బిగ్ బాస్-3 ‘ రియాల్టీ షో కి ఎలాగైతేనేం.. నాగార్జున మోస్ట్ గా వచ్చ్చేశాడు. ఇప్పటికే ప్రోమోలు టీవీలో వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎన్నో వడపోతల (ఫిల్టరింగ్) ద్వారా 14 మంది కంటెస్టెంట్లు వీళ్ళేనంటూ రోజుకో పేరుతో కూడిన వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒకరోజు కొందరి పేర్లు కనిపిస్తే.. మరో రోజు కొత్తగా మరికొందరి పేర్లు కనిపిస్తున్నాయి. వీళ్ళే వాళ్ళు అంటూ సైట్లు మోగిపోతున్నాయి. అసలు పార్టిసిపెంట్ల ఎంపిక (సెలెక్షన్ ) అన్నది ఆషామాషీ కాదు. ఇందుకు జరిగిన ఆలస్యమే చెబుతోంది. బిగ్ బాస్ తెలుగు రెండు సీజన్లూ కంప్లీట్ అయ్యాయక.. ఇక మూడో షో త్వరలో అంటూ నిర్వాహకులు ఆడియెన్స్ ని సస్పెన్స్ లో పెట్టేశారు. థర్డ్ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ముఖ్యంగా హోస్ట్ ని, కంటెస్టెంట్లను సెలక్ట్ చేయడంలో మేకర్స్ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఓవైపు తమిళ, మరాఠీ షో లు టీవీలో ప్రసారమవుతుండగా.. మరోవైపు-తెలుగు మూడో సీజన్ లాంచింగ్ లో జరుగుతున్న జాప్యంపై అనేకమంది నెటిజన్లు మేకర్స్ ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. మొట్టమొదట మూడో సీజన్ షో హోస్ట్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్ఠీఆర్ అని, మరొకరని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే జూన్ రెండో వారానికి అసలు హోస్ట్ ఎవరో తెలిసిపోయింది. ఈ షో హోస్ట్ అక్కినేని నాగార్జున అని అధికారికంగా ప్రకటించారు. ఇంకేం ! టీవీ ఆడియెన్స్ హ్యాపీ !ఇక వరుసగా ప్రోమోలు మొదలయ్యాయి. అన్ రియల్ పొజిషన్లో (వాస్తవ దూరంగా) ఉన్న కొందరు ఫేక్ పీపుల్ నటనను (అది నటనా?) చూపుతూ నాగార్జునతో కూడిన టీజర్ ని మేకర్స్ జులై 10 న రిలీజ్ చేశారు.
ఈ షో లో అసలు నటన అంటూ ఉండదని, వందరోజులు-64 కెమెరాలు రియాల్టీ షో నే చూపుతాయని నాగ్ చెబుతున్న ప్రోమోలను ఆ తరువాత విడుదల చేస్తూ వచ్చారు. ‘ నో యాక్టింగ్.. ఓన్లీ రియాల్టీ అనే నాగ్ పదం ఇప్పుడు జనం నోళ్ళలో నానుతోంది.
కంటెస్టెంట్లలో అనేకమంది సెలబ్రిటీల పేర్లు మొదట వినిపించాయి. వీరిలో కొంతమంది తాము ఈ షో లో పార్టిసిపేట్ చేయడంలేదని తోసిపుచ్చగా.. మరికొంత మంది మౌనంగా ఉన్నారు. తొలుత..తరుణ్ , ఉదయభాను, సింగర్ హేమచంద్ర, తీన్ మార్ సావిత్రి, శ్రీరెడ్డి, వైవాహర్ష, కె.ఏ. పాల్ ..ఇలా కొందరి పేర్లు బయటికొచ్చాయి. తాజాగా నటీమణులు హేమ, హిమజ, యాంకర్ శ్రీముఖి, వరుణ్ సందేశ్ వంటివారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక–లేటెస్ట్ గా ఓ యాంకర్ రేపిన వివాదం హాట్ హాట్ గా నడుస్తోంది. శ్వేతా రెడ్డి అనే ఈ యాంకర్.. షో నిర్వాహకుల వల్ల తను ఎదుర్కొన్న ‘ సమస్య ‘ ను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించి ఈ షో ని కాస్త వివాదంలోకి నెట్టిందా అన్న సందేహాలకు ఊపిరి పోసింది. మరో వైపు ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో ఓ కామన్ మ్యాన్ ఎంట్రీ ఉంటుందంటూ నిర్వాహకులు సరికొత్త విషయాన్ని ప్రకటించారు. ఇన్ని ‘ సంగతులతో ‘ ముడిపడిన ఈ మూడో షో ‘ భవితవ్యం ‘ ఎలా ఉంటుందో చూడాల్సిందే !